/rtv/media/media_files/2025/05/24/bct7rrsjWOlk52fiTJAF.jpg)
BSF shoots dead Pakistani intruder along international border in Banaskantha, Gujarat
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్‌కు చెందిన ఓ వ్యక్తి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించాడు. ఇది గమనించిన భద్రతా దళాలు అతడిని కాల్చి చంపాయి. శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్‌లోని బనస్కాంత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు భద్రతా బలగాలు ఓ ప్రకటనలో ఈ విషయం తెలిపాయి.
Also Read: కవిత చెప్పిన ఆ దెయ్యాలు ఈ ముగ్గురేనా?.. వారికి కవిత అంటే ఎందుకు కోపం?
BSF Shoots Dead Pakistani Intruder
'' సరిహద్దును దాటి కంచె వైపు వస్తున్న పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని గుర్తించాం. వెంటనే అప్రమత్తమయ్యి అతడిని అడ్డుకునేందుకు యత్నించాం. కానీ అతడు మమ్మల్ని పట్టించుకోలేదు. ముందుకు రావడంతో మేము కాల్పులు జరిపాం. ఈ కాల్పుల్లో అతడు మృతి చెందాడని'' ఆర్మీ అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే.
Also Read: 19 వేల మంది చిన్నారులను చంపేశారు.. ఇజ్రాయెల్ ఎంపీ ఆగ్రహం
ఇదిలాఉండగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొత్త అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఈ ఆపరేషన్‌లో 200 మందికి పైగా మృతి చెందారని చెబుతున్నారు. చనిపోయిన వాళ్లో అత్యధికులు ఉగ్రవాదులే ఉన్నారని కొంత మంది పాక్ సైనిక సిబ్బంది కూడా ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి రక్షణ వర్గాలు వివరాలు చెప్పినట్లు సమాచారం.
Also read: జర్మనీలో రెచ్చిపోయిన దుండుగురాలు..రైల్వే ఫ్లాట్ ఫామ్ లో దాడి..17 మందికి గాయాలు
Also Read: మావోయిస్టు పార్టీకి మరో షాక్.. మోస్ట్ వాంటెడ్ పప్పు ఎన్‌కౌంటర్!
india-pakistan | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu