/rtv/media/media_files/2025/05/24/pFhTqi8T8k58gTuXLUez.jpg)
israeli mp alleges in parliament 19000 children killed in gaza
ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మహిళలు, చిన్నారులే అధికంగా ఉంటున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ఎంపీ ఐమన్ ఒడె అక్కడి పార్లమెంటులో దీనిగురించి మాట్లాడారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆయన వ్యతిరేకించారు. దీంతో అక్కడున్న అధికారులు ఐమన్‌ను పక్కకు లాక్కెళ్లారు.
Also Read: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగానే
Israeli MP Alleges In Parliament
'' ఏడాదిన్నరగా గాజాలో మీరు 19 వేల చిన్నారుల ప్రాణాలు తీశారు. 52 వేల మందిని చంపేశారు. యూనివర్సిటీలు, ఆస్పత్రులను ధ్వంసం చేశారు. అయినాకూడా రాజకీయంగా గెలిచామనే భావనకు రాని పిచ్చివాళ్లు మీరు'' అని ఐమన్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన మాటలతో అక్కడ గందరగోళం నెలకొంది. ఐమన్ వ్యాఖ్యలను కొందరు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన పార్లమెంటులో ప్రసంగిస్తుండగానే అక్కడున్న అధికారులు ఐమన్‌ను పక్కకు లాక్కెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: దారుణం.. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో నిద్రిస్తున్న వ్యక్తి మృతి
“La única democracia en Oriente Medio”. Ayman Odeh, diputado en el Parlamento del Estado genocida israelí, es expulsado de la tribuna por decir la verdad. pic.twitter.com/ZOiuYZjtu0
— Paco Arnau (@ciudadfutura) May 21, 2025
ఇదిలాఉండగా ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ చర్యలపై వ్యతిరేకత వస్తోంది. ఇటీవల ఐడీఎఫ్ విశ్రాంత చీఫ్ యాయిర్ గొలాన్ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో చిన్నారులను చంపడం ఒక అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు.
Also Read: జర్మనీలో రెచ్చిపోయిన దుండుగురాలు..రైల్వే ఫ్లాట్ ఫామ్ లో దాడి..17 మందికి గాయాలు
Also Read: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు
telugu-news | national-news | rtv-news | hamas