/rtv/media/media_files/2025/05/24/M880p2jeKgFgdQT3eGUd.jpg)
పెళ్లికి అంతా సిద్ధమైంది. వరుడు తాళితో కట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాళి కట్టడమే ఇక మిగిలి ఉంది. అంతలోనే ఆపండి అన్న అరుపు వినిపించింది. అందరూ చుట్టూ చూశారు. అరిచింది ఎవరో కాదు స్వయంగా వధువే. అవును పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న పల్లవి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వేణుగోపాల్ లకు పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లికి కొన్ని క్షణాల ముందు ఆమె తన ప్రియుడినుంచి ఫోన్ వచ్చింది.
Also Read : నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు
వరుడు కూడా పెళ్లి వద్దని
దీంతో పెళ్లి కూతరు ఈ పెళ్లి చేసుకోలేనని ఖరాఖండిగా చెప్పేసింది. 'నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఈ పెళ్లి ఇష్టం లేదు' అంటూ లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన తల్లిదండ్రులు తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించారని ఆమె వరుడికి చెప్పింది. ఎవరూ ఎంత నచ్చజెప్పినా ఆమె పట్టు వీడలేదు. దీంతో వరుడు కూడా పెళ్లి వద్దని చెప్పి వెళ్లిపోయాడు. కర్ణాటక హసన్లోని ఆదిచుంచనగిరి కళ్యాణమండపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు రెండు కుటుంబాల సభ్యులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చర్చలు జరిపి ఇరు కుటుంబాలను ఒప్పించారు. వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకోవడానికి అంగీకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్.. వేశ్యలా చూశారన్న బాధతో!!
Marriage Cancle: ತಾಳಿ ಕಟ್ಟುವ ವೇಳೆ ಮದುವೆ ನಿಲ್ಲಿಸಿದ ವಧು | Hasan | Sanjevani News
— Sanjevani News (@sanjevaniNews) May 23, 2025
.
.
.
.#Sanjevani#SanjevaniNews#SanjevaniKannadaNews#sanjevanidigital#sanjevanivideos#Hassan#Marriage#Marriagecancle#Marriagestop#Girl#Bride#Groompic.twitter.com/GUlcXuOAe9
Also Read : తాళికట్టే సమయంలో వరుడికి బిగ్ షాకిచ్చిన పెళ్లికూతురు
Also Read : భారత్‌లో చొరబడేందుకు యత్నించిన పాక్ జాతీయుడు.. కాల్చి చంపిన BSF
karnataka