BIG BREAKING: దేశంలో కరోనా కొత్త వేరియంట్లు!

దేశంలో పలు చోట్లు కొవిడ్‌ కొత్త వేరియంట్‌లను అధికారులు గుర్తిస్తున్నారు. కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7 లను గుర్తించినట్లు  గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం శనివారం వెల్లడించింది.

New Update
Covid: భారత్‌ లో కొత్త కోవిడ్ వేరియంట్‌.. దాని నుంచి ఎలా రక్షణ పొందాలి?

Covid New Variant

కరోనా వైరస్ దేశంలో పంజా విసురుతోంది. దేశంలో పలుచోట్ల కొవిడ్‌ కొత్త వేరియంట్‌లను అధికారులు గుర్తిస్తున్నారు. కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7 లను ఇండియాలో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం శనివారం వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు

కోవిడ్ న్యూ వేరియంట్..

గత నెలలోనే ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌ను గుర్తించగా ఈ నెలలో దీనికి సంబంధించి నాలుగు కేసులను గుర్తించారు. మొదట తమిళనాడు, గుజరాత్‌లో నమోదయ్యాయి. ఇప్పుడు ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మూడేళ్లలో మొదటిసారి ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!

దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. హాంకాంగ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌తో పాటు చైనాలో కూడా కొవిడ్‌-19 వ్యాప్తిస్తోంది. దీనికి కారణం జేఎన్‌.1 వేరియంట్‌ అని అధికారులు చెబుతున్నారు. జేఎన్‌.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి ప్రస్తుతం ఎక్కుువగా ఉంది. ఎక్కువ శాతం మందిలో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: Ind Vs Eng: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!

ఇది అంత ప్రమాదకరం కాదని, బాధితులు కేవలం నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వం అప్రమత్తమవుతుంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్లు ఉండేలా ఆసుపత్రులను చూస్తోంది. 

covid-19 | covid 19 positive | covid 19 news | covid 19 in india | Covid New Variant
Advertisment
Advertisment
తాజా కథనాలు