BIG BREAKING: ‘బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్’

సామ రాం మోహన్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. BRS నుంచి కవితని సస్పెండ్ చేస్తారని చెప్పారు. కవిత లేఖ గురించి ఆయన 2 వారాల ముందే చెప్పారు. సామ రాం మోహన్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ కవిత చెప్పిన దెయ్యాలు హరీశ్ రావు, KTR, సంతోష్ రావులే అని అన్నారు.

New Update
Kavitha

Kavitha

కాంగ్రెస్ లీడర్ సామ రాం మోహన్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్‌లో చీలిక రాబోతుందని, కవిత కేసీఆర్‌కు లేఖ రాసిందని ఆయన రెండు వారాల ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లే కవిత కేసీఆర్‌కు రాసిన లేఖ బయటపడింది. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. అలాగే ఆమె రాసిన లేఖపై శుక్రవారం వివరణ ఇస్తూ కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఉన్నాయని కవిత అన్నారు. ఆ దెయ్యాలు ఎవరో కూడా సామ రాం మోహన్ రెడ్డి చెప్పారు. సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావులే కవిత చెప్పిన దెయ్యాలని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడమే వాళ్ల ప్లాన్ అని రాం మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు.

Also Read :  సిగ్గుందరా .. మరో పాకిస్తాన్ గూఢచారి అరెస్టు

Also Read :  మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్‌.. వేశ్యలా చూశారన్న బాధతో!!

Also Read :  విజయవాడ రైల్వేస్టేషన్‌ లో బాంబ్ కలకలం

Kavitha Suspended From BRS Party

అలాగే కవిత లేఖ గురించి పది రోజుల ముందే తాను చెప్పానని గుర్తుచేశారు. నేడో, రేపో కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనన్నారు. సంతోష్‌ రావుని పార్టీ ప్రెసిడెంట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. కేసీఆర్‌కు జయలలిత పరిస్థితి వచ్చిందన్నారు. కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆమె సొంత పార్టీ పెడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కవితతో మాట్లాడి సమస్య పరిష్కరించుకునే ఆలోచన కేటీఆర్‌కి లేదని, సొంత మనుషులే కేసీఆర్‌ను వెన్నుపోటు పొడుస్తారని ఆయన అన్నారు. కుటుంబాన్ని విచ్చిన్నం చేసినా కేసీఆర్ నిస్సహాయుడిగా ఉన్నారు. పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడితే గతంలో అనేకమందిపై కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. కేసీఆర్‌తో కవిత మాట్లాడతా అంటే సంతోష్ అడ్డుకున్నాడని సామ రాం మోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఏం చేయాలో, ఎవర్ని కలవాలో సంతోష్ రావు డిసైడ్ చేస్తున్నారు. కేసీఆర్ దర్శనానికి ఎమ్మెల్యేల దగ్గర సంతోష్ రావు డబ్బులు తీసుకుంటాడని ఆయన ఆరోపించాడు.

Also Read :  తాళికట్టే సమయంలో వరుడికి బిగ్ షాకిచ్చిన పెళ్లికూతురు

Sama Ram Mohan Rao | kavitha | brs | telangana | congress | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు