/rtv/media/media_files/2025/05/24/NEnKx8vPe3WQX2PCfy05.jpg)
గుజరాత్‌లో మరో పాకిస్తాన్ గూఢచారి పోలీసులకు చిక్కాడు. భారత వైమానిక దళం (IAF), సరిహద్దు భద్రతా దళం (BSF) కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్ తో పంచుకున్నందుకు కచ్ ప్రాంతానికి చెందిన సహదేవ్ సింగ్ గోహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సహదేవ్ కచ్‌లోని దయాపర్‌లో హెల్త్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. 28 ఏళ్ల అదితి భరద్వాజ్ అనే పేరుతో పాకిస్తానీ హ్లాండ్లర్ సహదేవ్‌తో వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకుని ట్రాప్ చేసింది. కీలక సమాచారాన్ని చేరవేసినందుకు సహదేవ్ రూ.40వేలు తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి.
Also Read : ‘బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్’
🚨 🚨 #BreakingNews Gujarat Man Arrested For Spying For Pak, Shared Key Info On Air Force https://t.co/NwSFQ6Ze0P
— Instant News ™ (@InstaBharat) May 24, 2025
A man in Gujarat has been arrested for allegedly sharing key information related to the Indian Air Force (IAF) and the Border Security Force (BSF) with a Pakistan…
Also Read : నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు
ఫోటోలు, వీడియోలు పంపాడు
సహదేవ్ ఆమెకు నిర్మాణంలో ఉన్న IAF, BSF సైట్‌ల ఫోటోలు, వీడియోలను పంపాడని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) సీనియర్ అధికారి కె సిద్ధార్థ్ విలేకరులకు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది టూరిస మృతి చెందిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ అరెస్టులు జరిగాయి. గూఢచర్యం ఆరోపణలపై పది మందికి పైగా యూట్యూబర్, వ్యాపారవేత్త మరియు సెక్యూరిటీ గార్డులు అరెస్ట్ అయ్యారు.
Also Read : మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్.. వేశ్యలా చూశారన్న బాధతో!!
Also Read : భారత్‌లో చొరబడేందుకు యత్నించిన పాక్ జాతీయుడు.. కాల్చి చంపిన BSF
ind-vs-pak