SRH VS RCB: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం

ప్లే ఆఫ్స్ కు వెళ్ళాల్సినప్పుడు ఆడాల్సిన మ్యాచ్ లు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన జట్ను ఓడించడానికి ఆడుతున్నాయి. ఇంక ఛాన్స్ లేదని తెలిశాక హైదరాబాద్ సన్ రైజర్స్ అదరగొడుతోంది. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో గెలిచింది. 

New Update
ipl

SRH VS RCB

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ కు జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ విజృంభించేసింది. మొదట బ్యాటింగ్ చేసిన  హైదరాబాద్ 230 పరుగులు భారీ లక్ష్యాన్ని ఆర్సీబీకి ఇచ్చింది. మొదట కోహ్లి, ఆ తర్వాత సాల్ట్‌ చెలరేగి ఆడి ఛేదనలో జట్టుకు బలమైన పునాదే వేసినా కూడా ఆర్సీబీకి చివరకు చేతులెత్తేయక తప్పలేదు. బెంగళూరు 19.5 ఓవర్లలో ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌  32 బంతుల్లో 4×4, 5×6లతో 62 పరుగులు, విరాట్‌ కోహ్లి  25 బంతుల్లో 7×4, 1×6లతో 43 పరుగులు చేశారు. ఓపెనింగ్ కు దిగిన సాల్ట్ కుదురుకోవడానికి ఎక్కువ బంతులను తీసుకున్నాడు. దీంతో మ్యాచ్ రన్ రేట్ బాగా పెరిగిపోయింది. అయితే మిగతా బ్యాటర్లు ఎవరూ సరిగ్గా ఆడకపోవడంతో మ్యాచ్ ఓడిపోక తప్పలేదు. మరోవైపు హైదరాబాద్ బౌలర్లు కమిన్స్‌ (3/28), ఇషాన్‌ మలింగ (2/37), నితీశ్‌ కుమార్‌రెడ్డి (1/13), హర్ష్‌ దూబె (1/20) బెంగళూరును కట్టడి చేశారు.

Also Read:మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం

Also Read:సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఇషాన్ కిషన్ దంచేశాడు..

అంతకు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ స్కోర్ చేసింది.  20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బ్యాటర్లలో ఇషాన్‌ కిషన్‌ 94*, అభిషేక్‌ శర్మ 34 రాణించారు.  రాయల్‌ ఛాలెంజర్స్‌ బౌలర్లలో షెఫర్డ్‌ 2, కృనాల్‌ పాండ్య, సుయాశ్‌ శర్మ, లుంగి ఎంగిడి, భువనేశ్వర్‌ కుమార్ తలో వికెట్‌ పడగొట్టారు.  ఇప్పటికే ప్లేఆఫ్‌ రేసు నుంచి ఔట్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, సీజన్‌ను ఘనంగా ముగించింది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో సెంచరీ తర్వాత పెద్ద ఇన్నింగ్స్‌ ఆడని ఇషాన్‌ కిషన్‌.. ఈ మ్యాచ్‌లో చెలరేగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో అతను భారీ షాట్లు ఆడాడు. క్లాసెన్ 24, అనికేత్ శర్మ 26 కీలక పరుగులు చేశారు. సన్‌రైజర్స్‌ ప్రధాన బ్యాటర్లలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (4) మినహా అందరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించారు.

Also Read:నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-srh | match

Also Read: Trump VS Harvard: ట్రంప్ కు బిగ్ షాక్..హార్వర్డ్ ప్రవేశాల నిర్ణయానికి చెక్ పెట్టిన జడ్జి

Advertisment
తాజా కథనాలు