/rtv/media/media_files/2025/05/24/9YupLSyZEkiMP8DhaVj4.jpg)
Shock To Trump
హార్వర్డ్ విషయంలో ట్రంప్ ఆటలు సాగడం లేదు. యూనివర్శిటీకి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చాలా గట్టిగానే అడ్డంకులు పడుతున్నాయి. హార్వర్డ్ యూనివర్శిటీ అధికారులు కూడా అమెరికా ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేదే లేదు అన్నట్టు ప్రవర్తిస్తోంది. తాజాగా విదేశీ విద్యార్థుల అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే విదేశీ విద్యార్థులను వెనక్కు పంపేయాలని ఆజ్ఞలు జారీ చేసింది. దీనిపై యూనివర్శిటీ కోర్టుకెక్కింది. ఇంతకు ముందు విశ్వవిద్యాలయం గ్రాంట్స్ కట్ట చేసినప్పుడు కూడా ఇలాగే ఫైట్ చేసింది. ఇప్పుడు కూడా విదేశీ విద్యార్థుల అనుమతి నిషేధంపై కోర్టుకు వెళ్ళింది యూనివర్శిటీ. అక్కడ హార్వర్డ్ కు అనుకూలంగా జడ్జి తీర్పు ఇవ్వండతో ట్రంప్ ప్రభుత్వానికి చెక్ పడ్డట్టయింది. బోస్టన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అలిసన్ బరోస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన
Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం
విద్యార్థులకు అన్యాయం..
హార్వర్డ్ లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులు వీసా కోసం అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్‌తో విద్యార్థులు వీసాకు అప్లై చేస్తారు. అలాంటప్పుడు ఎస్‌ఈవీపీ సిస్టమ్ నుంచి హార్వర్డ్ ను తొలగించడం చాలా అన్యాయమంటూ యూనివర్శిటీ పిటిషన్ వేసింది. ఒక్క నిర్ణయంతో విశ్వవిద్యాయంలో పావు వంతు స్టూడెంట్స కు అన్యాయం చేయదలుచుకున్నారని చెప్పింది. దీని వలన చాలా మంది భవిష్యత్తు గల్లంతు అవుతుందంటూ మొరపెట్టుకుంది. 140కి పైగా దేశాల్లోని విద్యార్థులు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న, త్వరలో రాబోయే విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 7,000 మంది. అమెరికా ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఇలా విద్యార్థులను కషటపెట్టడం సముచితం కాదని కోర్టులో చెప్పింది. దీన్ని పరిగలోకి తీసుకున్న జడ్జి ప్రభుత్వ నిషేధం నిర్ణయాన్ని ఆపాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి
Also Read: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన
today-latest-news-in-telugu | usa | america president donald trump | Trump Vs Harvard