King Cobra on Bed UP: వణుకు పుట్టించే వీడియో..!! పడుకున్న వ్యక్తి పక్కలో దూరిన భారీ నాగుపాము.. (Viral Video)

ఒక వ్యక్తి కింగ్ కోబ్రా పాముతో మంచంపై పక్కపక్కన పడుకుని భయపడకుండా వీడియో తీయడం వైరల్ అయింది. పాము అతని తలవైపు వచ్చి కన్నుల్లోకి చూడగానే అతడు ఒక్కసారిగా బెదిరిపోయి పరుగు తీశాడు. ఈ వీడియో చుస్తే మాత్రం ఒళ్లు జలదరిస్తోంది..

New Update
King Cobra on Bed UP

King Cobra on Bed UP

King Cobra on Bed UP: తాజాగా ఒక సంచలన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి అత్యంత విషపూరితమైన పాము(Snake)లలో ఒకటైన కింగ్ కోబ్రాతో కలిసి మంచంపై పక్కపక్కనే పడుకుని ఉన్నాడు. అప్పటివరకు భయపడకుండా ఉన్న ఆ వ్యక్తి.. పాము కళ్ళలోకి చూడగానే వణుకుతో పరుగందుకున్నాడు. 

Also Read: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం

ఈ వీడియోను 'ఇన్‌సైడ్ హిస్టరీ' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ అయింది. అయితే, ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగినట్టు సమాచారం. కానీ ఈ సంఘటన ఎప్పుడు జరిగింది.. ఆ వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడా? లేడా? అన్న విషయాలపై ఇంకా స్పష్టత లేదు.

Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం

అసలు ఏం జరిగిందంటే..?

ఒక వ్యక్తి నిద్రిస్తూ ఉండగా ఎక్కడినుంచో ఒక పెద్ద కింగ్ కోబ్రా మంచంపైకి నెమ్మదిగా వచ్చి ఆ వ్యక్తి పక్కనే పడుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి ఏమీ భయపడకుండా తన ఫోన్‌తో వీడియో తీస్తూ ఉన్నాడు. అయితే, పాము అతని తలవైపు తిరిగి దగ్గరగా వచ్చి కన్నుల్లోకి నేరుగా చూసిన వెంటనే అతడు ఒక్కసారిగా బెదిరిపోయి మంచం నుంచి ఎగిరి పడ్డాడు. కోబ్రా మాత్రం సైలెంట్ గా అతన్ని చూస్తూ ఉంది.

Also Read: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఈ వీడియోపై నెటిజన్ల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు, కొంతమంది అతని ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొంతమంది అతనిది మూర్ఖత్వం అంటూ తిడుతున్నారు. “ప్రకృతి రెండవ అవకాశం ఇవ్వదు,” అంటూ ఓ 'ఇన్ స్టా' యూజర్  కామెంట్ చేయగా, మరొకరు “పాము ఆ వ్యక్తి కంటే కూల్ గా ఉంది!” అంటూ రాసుకొచ్చారు.

Also Read: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన

అలాగే, “ఇది ధైర్యం కాదు, ఇది మూఢనమ్మకం,” అంటూ పలువురు కామెంట్లు చేయగా. ఇంకొందరు అయితే, “ఇలాంటి పరిస్థితిలో నేను ఉంటే నేరుగా కిటికీలోనుండి దూకేసేవాడిని,” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ వీడియో చుస్తే మాత్రం ఒళ్లు జలదరిస్తోంది..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు