/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
దాదాపుగా ఎనిమిదేళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు ఉంది. ఈ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు కూడా మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. సాధారణంగా రుతుపవనాలు కేరళకు జూన్ 1వ తేదీన వస్తాయి. కానీ ఈ ఏడాది ముందుగానే వచ్చేశాయి.
ఇది కూడా చూడండి: Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు
అల్పపీడనం వాయు గుండంగా మారి..
రుతుపవనాల వల్ల అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయు గుండంగా మారి.. తుపాన్‌గా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. దీనివల్ల ఏపీ, తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!
ఈ క్రమంలో హైదరాబాద్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏపీలో అల్లూరి సీతారామరాజు, మన్యం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది IMD తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చూడండి: Ind Vs Eng: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!
rains | weather