🔴Live News Updates: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Russia Drone Strikes: కీవ్ నగరంపై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా

ఉక్రెయిన్‌, రష్యా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా మరోవైపు యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మరోసారి కీవ్‌పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది.

Russia attack on Ukraine

ఉక్రెయిన్‌, రష్యా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా మరోవైపు యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మరోసారి కీవ్‌పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది. ఈ దాడుల్లో కీవ్‌లోని పోలండ్‌ దౌత్యకార్యాలయం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపింది. దాడి జరుగుతున్న సమయంలో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు స్థానికులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్న వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Also Read: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!

  • Jul 05, 2025 21:43 IST

    పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ

    రాజస్థాన్‌లో మోనా బుగాలియా 2021లో ఎస్సై ఎగ్జామ్స్‌ రాసింది. క్వాలిఫై కాలేకపోయింది. దీంతో మూలీ దేవి అనే పేరుతో ఫోర్జ్‌డ్‌ డాక్యుమెంట్లు సృష్టించి అకాడమీలో రెండేళ్లు ట్రైనింగ్ తీసుకుంది. తర్వాత అసలు విషయం బయటపడింది.

    Lady Fake SI

     



  • Jul 05, 2025 20:26 IST

    కాంగ్రెస్ కార్యకర్త మృతి.. మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ సంతాపం!

    కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన  కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హజరై తిరిగి వెళ్తుండగా... జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్టంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కొర్రి శ్రీను దుర్మరణం చెందాడు.

    uttam mahesh



  • Jul 05, 2025 19:46 IST

    దంచుతున్న గిల్.. కోహ్లీ రికార్డు ఖతం

    ఒకే టెస్టులో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు.  ఇంగ్లండ్ తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్ లో  శుభ్‌మన్ గిల్ (80; 100 బంతుల్లో) దూకుడుగా ఆడుతున్నాడు.ఒకే టెస్టులో అత్యధిక పరుగులు (346*) చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

    kohli gill



  • Jul 05, 2025 18:27 IST

    తిరుమల భక్తులకు అలెర్ట్... ఆ రెండు రోజులు దర్శనాలు రద్దు!

    తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2025 జులై 15,16వ తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.  శ్రీవారి ఆలయంలో జులై 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా టీటీడీ తెలిపింది.

    ttd devotees



  • Jul 05, 2025 16:49 IST

    సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి

    విశాఖపట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొలిపావాంచా వద్ద రేకుల షెడ్డు కూలింది. షెడ్డుకింద ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయకపోవడంతో వల్లే షెడ్డు కూలిందని స్థానికులు అంటున్నారు.

    simhadri appanna



  • Jul 05, 2025 15:58 IST

    ఢీకొన్న ఐదు బస్సులు.. అమరనాథ్‌ యాత్రలో ప్రమాదం

    అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులు ఒకదానికోకటి నాలుగు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగగా.. నాలుగు బస్సులు దెబ్బతిన్నాయి.

    amaranath yatra



  • Jul 05, 2025 15:57 IST

    అమెరికాలో నీర‌వ్ మోదీ తమ్ముడు అరెస్టు

    డైమండ్ వ్యాపారి నేహ‌ల్ మోదీని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ స‌మ‌ర్పించిన అభ్యర్థన ఆధారంగా అత‌న్ని అరెస్ట్ చేశారు. అమెరికాలో డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసిన‌ట్లు నేహ‌ల్ మోదీపై కేసు న‌మోదైంది.

    nehel modi arrest

     



  • Jul 05, 2025 15:57 IST

    ఎడ్జ్‌బాస్టన్‌లో సిరాజ్ అద్భుతం.. 1993 తర్వాత ఇదే మొదటిసారి



  • Jul 05, 2025 15:56 IST

    ఏపీలో దారుణం.. పాతకక్షలతో మొహరం ఉత్సవాల్లో వ్యక్తి హత్య

    ప్రకాశం జిల్లా నల్లగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. మొహరం పండుగ ఉత్సవాల్లో వ్యక్తిని హత్య చేశారు. పాతకక్షలతో వెంకటేశ్వర్లను గొడ్డలితో నరికి చంపారు ప్రత్యర్థులు. హత్య రాజకీయ కోణంలో జరిగిందా అన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



  • Jul 05, 2025 15:56 IST

    తెలంగాణలో దారుణం.. భార్య చేతిలో మరో భర్త బలి..ప్రియుడి మోజులో పడి

    ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను చంపేందుకు కూడా భార్యలు వెనుకడాటం లేదు. సమాజంలో ఇలాంటి తరహా ఘటనలే ఇప్పుడు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తను గొంతునులిమి చంపేసిందో భార్య.

    Narayanpet



  • Jul 05, 2025 15:55 IST

    ప్రభాస్‌ 50 లక్షల సహాయంలో బిగ్‌ ట్విస్ట్‌.. ఫిష్ వెంకట్ కూతురు షాకింగ్ వీడియో!

    ఫిష్ వెంకట్ కి ప్రభాస్ రూ. 50 లక్షల సాయం చేశారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన కూతురు స్రవంతి  వీడియో రిలీజ్ చేసింది. ప్రభాస్ PA అంటూ ఒకరు కాల్ చేశారు.. కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి సహాయం అందలేదని తెలిపింది.

    Read More



  • Jul 05, 2025 15:54 IST

    భారీ అగ్నిప్రమాదం.. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న యువకుడు మృతి

    ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాల్ మెగా మార్ట్‌ మాల్ లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం సమయంలో కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ (25) లిఫ్ట్‌లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతడు పీజీలో ఉంటూ సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు.

     

    delhi karol bagh fire breaks out in vishal mall one died
    delhi karol bagh fire breaks out in vishal mall one died

     



  • Jul 05, 2025 15:05 IST

    మరోసారి యశోద ఆసుపత్రికి కేసీఆర్..

    స్వల్ప అస్వస్థత కారణంగా గురువారం రోజున యశోద  ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బీఆర్ఎస్ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ వైద్యుల సలహామేరకు శనివారం డిశ్చార్జీ అయ్యారు. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం ఆరోగ్యం మెరుగ్గానే ఉందన్నారు.

    kcr-yashoda

     



  • Jul 05, 2025 14:21 IST

    ఆ ఒక్కడికి తప్పా అందరికీ కృతజ్ఞత ఉంది.. ఆర్పీపై రోజా షాకింగ్ కామెంట్స్!

    జబర్దస్త్ లో ఒక్కడికి తప్పా అందరికీ కృతజ్ఞత ఉంది అంటూ రోజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే రోజా జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీని ఉద్దేశిస్తూనే ఈ కామెంట్స్ చేసినట్లు నెటిజన్లు అనుకుంటున్నారు.

     

    roja comments on kiraak rp jabardasth
    roja comments on kiraak rp jabardasth

     



  • Jul 05, 2025 14:20 IST

    ఆదిత్య ఫార్మసీ MD నరసింహమూర్తి రాజు సూసైడ్

    ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు శనివారం ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ అయోధ్య క్షత్రియ నగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఉరేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లారు.

     

    BREAKING NEWS
    BREAKING NEWS

     



  • Jul 05, 2025 12:11 IST

    Oh Bhama Ayyo Rama: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!

    హీరో సుహాస్, మాళవిక మనోజ్‌ జంటగా రామ్‌ గోదల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామా’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కామెడీ, ఎమోషనల్‌గా ట్రైలర్ అదిరిపోయింది. ఈ మూవీలో అనిత హస్సానందాని, అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

     

    Oh Bhama Ayyo Rama Theatrical Trailer
    Oh Bhama Ayyo Rama Theatrical Trailer

     



  • Jul 05, 2025 09:59 IST

    Viral Vayyari: 'వైరల్ వయ్యారి'.. అంటూ అదరగొట్టిన శ్రీలీల! పాట చూశారా?

    కిరీటీ రెడ్డి- శ్రీలీల జంటగా నటించిన 'జూనియర్' నుంచి అదిరిపోయే మాస్ బీట్ రిలీజ్ చేశారు. 'వైరల్ వయ్యారి'.. అంటూ సాగిన ఈ పాటలో శ్రీలీల డాన్స్  స్టెప్పులతో అదరగొట్టింది. అలాగే రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ ప్రేక్షకులకు ఫుల్ ఇచ్చేలా ఆకట్టుకుంటోంది.  

     

    viral vayyari song sreeleela
    viral vayyari song sreeleela

     



  • Jul 05, 2025 09:59 IST

    Masood Azar: మసూద్ అజర్‌ ఎక్కడున్నాడంటే.. భుట్టో సంచలన వ్యాఖ్యలు

    పీపీపీ నేత బిలావల్‌ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు కూడా మసూజ్ అజర్‌ ఎక్కడున్నాడనే విషయం తెలియదని తెలిపారు. ఒకవేళ అతడు పాక్‌లోనే ఉన్నట్లు భారత్‌ నిరూపిస్తే.. అతడిని మేము అరెస్టు చేయడాన్ని ఆనందంగా భావిస్తామని అన్నారు.

     

    Bilawal Bhutto says Pak doesn't know where Masood Azhar is
    Bilawal Bhutto says Pak doesn't know where Masood Azhar is

     



  • Jul 05, 2025 09:32 IST

    Julian McMahon: క్యాన్సర్‌తో మార్వెల్ నటుడు కన్నుమూత!

    హాలీవుడ్ యాక్టర్ జులియన్ మెక్‌మహన్(56) క్యాన్సర్‌తో మృతి చెందినట్లు తన భార్య కెల్లీ వెల్లడించారు. జులియన్ మార్వెల్ మూవీస్ ఫెంటాస్టిక్ ఫోర్‌లో Dr.డూమ్‌గా పాపులర్ చెందారు.

    marvel actor
    marvel actor

     



  • Jul 05, 2025 09:31 IST

    Earthquake in America: అమెరికాలో భూకంపం..ఇక యుగాంతమే...?

    అమెరికాలో భూకంపం సంభవించింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో నమోదవుతున్న భూ కంపాలు పెను సంచలనంగా మారుతున్నాయి. అమెరికాతో పాటు అర్జెంటీనా, పెరూ, ఫిలిప్పైన్స్‌లో కూడా భూ కంపాలు నమోదవుతున్నాయి. దీంతో యుగాంతం దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం సాగుతోంది.

     

    Earthquake
    Earthquake

     



  • Jul 05, 2025 09:30 IST

    Vande Bharat : ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్లో వందేభారత్‌కు మరో 4 కోచ్‌లు

    సికింద్రాబాద్‌,విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కోచ్‌ల సంఖ్య పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్ల(20707, 20708)లో ప్రస్తుతం 14 ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు ఉండగా వాటి సంఖ్యను 18కి పెంచినట్లు వెల్లడించింది.

    Vande Bharat



  • Jul 05, 2025 09:29 IST

    Nude Video Call : బరితెగించిన హీరోయిన్‌..బాడీతో వ్యాపారం..రెండునెలల్లో రూ.10 కోట్ల ఇన్‌కం..

    హీరోయిన్ ఖుషీ ముఖర్జీ ఇటీవల చేసిన పనితో తెగ వైరల్‌ అయింది. ఇన్నర్‌ వేసుకోకుండా షో చేసి మీడియాకు చిక్కిన ఈ బ్యూటీని తిట్టనివారు లేరు. తాజాగా మరోసారి ఈ భామ తెగ వైరల్‌గా మారింది. అదేంటంటే ఆమె న్యూడ్‌ కాల్స్‌తో కోట్లు సంపాదిస్తున్న వార్త వైరల్‌గా మారింది.

    khushi mukherjee



  • Jul 05, 2025 08:00 IST

    Dogs: సంచలన నిర్ణయం.. పక్కింటి వాళ్లు పర్మిషన్ ఇస్తేనే కుక్కను పెంచుకోవాలి

    గుజరాత్‌లోని సూరత్‌ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.ఎవరైనా తమ ఇంట్లో శునకాన్ని పెంచుకోవాలంటే కనీసం 10 మంది పొరుగు వాళ్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOP) తీసుకోని తమకు సమర్పించాలని ఆదేశించింది.

     

    Surat Municipal Corporation introduces dog licence in Gujarat
    Surat Municipal Corporation introduces dog licence in Gujarat

     



  • Jul 05, 2025 07:49 IST

    Russia-Ukraine War : ఉక్రెయిన్‌పై యుద్దం ఆపేది లేదు : పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్

    ఉక్రెయిన్‌ పై రష్యా తన దాడిని ఇప్పట్లో అపేలా లేదు. అదే విషయాన్ని పుతిన్‌ స్పష్టం చేశారు. యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పై యుద్ధం ఆపేది లేదని కన్ఫామ్ చేశారు. లక్ష్యం నెరవేరే వరకూ యుద్ధం ఆగదని స్పష్టం చేశారు.

    Russia-Ukraine War



  • Jul 05, 2025 07:46 IST

    Delhi: వెనక్కి తగ్గిన బీజేపీ సర్కార్.. మోసపోయాం అంటున్న కార్ల యజమానులు

    ఢిల్లీలో కొత్త వాహన పాలసీ భయంతో చాలామంది కార్ల యజమానులు చౌకగా తమ వాహనాలు అమ్మేశారు. కానీ ఢిల్లీ సర్కార్‌ ఈ పాలసీని అమలుచేయలేదు. ఈ నిర్ణయం ముందే తీసుకొని ఉంటే తాము తక్కువ రేట్లకు అమ్ముకునేవాళ్లం కాదని యజమానులు బాధపడుతున్నారు.

     

    Public Anger Wins, Delhi Government Says Won't Scrap Old Cars And Bikes
    Public Anger Wins, Delhi Government Says Won't Scrap Old Cars And Bikes Photograph: (Public Anger Wins, Delhi Government Says Won't Scrap Old Cars And Bikes)

     



  • Jul 05, 2025 07:46 IST

    Pakistan : ప్రియుడితో పెళ్లికి అడ్డు ఉన్నారని..27 మందిని చంపిన యువతి

    తాము కోరుకున్నది దక్కించుకోవడానికి మనుషులు ఎంతకైన తెగిస్తున్నారు. అందుకు అడ్డు వస్తే తల్లి, తండ్రి, పిల్లలు ఇలా ఎవరినైనా సరే అంతమొందిస్తున్నారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఏకంగా 27 మంది కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకుందో యువతి.

    A young woman killed 27 people



  • Jul 05, 2025 06:47 IST

    Big Beautiful Bill: చట్టంగా మారిన బిగ్ బ్యూటిఫుల్ బిల్

    అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణ కోసం ఈ బిల్లును ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

     

    Donald Trump signs ‘Big Beautiful Bill’ at the White House July 4 picnic
    Donald Trump signs ‘Big Beautiful Bill’ at the White House July 4 picnic

     



Advertisment
Advertisment
తాజా కథనాలు