/rtv/media/media_files/2025/07/05/surat-municipal-corporation-introduces-dog-licence-in-gujarat-2025-07-05-07-58-01.jpg)
Surat Municipal Corporation introduces dog licence in Gujarat
చాలామంది జంతు ప్రేమికులు తమ ఇంట్లో పెంపుడు కుక్కలు పెంచుకుంటారు. కానీ కొన్నిసార్లు అవి చుట్టుపక్కల వారిపై దాడులు చేస్తాయి. దీనివల్ల ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కుక్కల దాడుల వల్ల చిన్నారులు మృతి చెందిన ఘటనలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పెంపుడు జంతువులపై ఆంక్షలు విధించింది.
Also Read: అయ్యయ్యో..చూస్తుండగానే నదిలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్ల లారీ!
ఎవరైనా తమ ఇంట్లో శునకాన్ని పెంచుకోవాలంటే కనీసం 10 మంది పొరుగు వాళ్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOP) తీసుకోని తమకు సమర్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. ఒకవేళ బహుళ అంతస్తుల్లో ఉండేవారు శునకాన్ని పెంచుకోవాలంటే ఆ భవనం సంక్షేమ సంఘం ఛైర్‌పర్సన్, కార్యదర్శి పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని చెప్పింది. ఈ ఏడాది మే నెలలో సూరత్‌లో కుక్క దాడిలో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన అక్కడ తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
Also Read: హాస్పిటల్‌లో దారుణం.. యువకుడి ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టర్
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో కుక్క దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. పలువురు చిన్నారులు కూడా మృతి చెందారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వీధుల్లో తిరిగే పలు కుక్కలకు పునరుత్పత్తి ఆపేందుకు స్టెరిలైజేషన్ కూడా చేయించింది.