Masood Azar: మసూద్ అజర్‌ ఎక్కడున్నాడంటే.. భుట్టో సంచలన వ్యాఖ్యలు

పీపీపీ నేత బిలావల్‌ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు కూడా మసూజ్ అజర్‌ ఎక్కడున్నాడనే విషయం తెలియదని తెలిపారు. ఒకవేళ అతడు పాక్‌లోనే ఉన్నట్లు భారత్‌ నిరూపిస్తే.. అతడిని మేము అరెస్టు చేయడాన్ని ఆనందంగా భావిస్తామని అన్నారు.

New Update
Bilawal Bhutto says Pak doesn't know where Masood Azhar is

Bilawal Bhutto says Pak doesn't know where Masood Azhar is

Masood Azar:

భారత్‌ మోస్ట్ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌, జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్ ఆచూకి ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలి ఉంది. తాజాగా పాకిస్థాన్(Pakistan) పీపుల్స్ పార్టీ (PPP) నేత బిలావల్‌ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు కూడా మసూజ్ అజర్‌ ఎక్కడున్నాడనే విషయం తెలియదని తెలిపారు. ఒకవేళ అతడు పాక్‌లోనే ఉన్నట్లు భారత్‌ నిరూపిస్తే.. అతడిని మేము అరెస్టు చేయడాన్ని ఆనందంగా భావిస్తామని అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also Read: ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్లో వందేభారత్‌కు మరో 4 కోచ్‌లు

ఇదిలాఉండగా.. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన మసూద్ అజర్‌(Masood Azhar Global Terrorist)కు దేశంలో జరిగిన పలు భారీ ఉగ్రదాడులతో సంబంధాలు ఉన్నాయి. 2001లో పార్లమెంటుపై దాడి, 26/11 ముంబయి దాడులు, 2016 పటాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడి, అలాగే 2019లో పుల్వామా ఉగ్రదాడితో కూడా అతడికి సంబంధాలు ఉన్నాయి. 

Also Read: బరితెగించిన హీరోయిన్‌..బాడీతో వ్యాపారం..రెండునెలల్లో రూ.10 కోట్ల ఇన్‌కం..

అంతేకాదు 2019లో అతడిని ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే 1999లో  కందాకర్‌ ఫ్లైట్‌ను ఉగ్రవాదులు హైజాక్‌ చేసినప్పుడు.. బందీలను విడిపించేందుకు భారత కస్టడీలో ఉన్న మసూద్‌ అజర్‌ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో భారత ప్రభుత్వం అతడిని నుంచి విడుదల చేసింది. ఆ తర్వాత అతడి ఆచూకి గురించి ఎవరికీ తెలియలేదు. చాలామంది పాకిస్థాన్‌లో ఉండి ఉంటాడని భావిస్తున్నారు. కానీ పాక్‌ మాత్రం అతడు అఫ్గానిస్థాన్‌లో ఉన్నట్లు భావిస్తోందని బిలావల్ బుట్టో అన్నారు. 

Also Read: ఉక్రెయిన్‌పై యుద్దం ఆపేది లేదు : పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్

Also Read: Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు