Russia Drone Strikes: కీవ్ నగరంపై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా

ఉక్రెయిన్‌, రష్యా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా మరోవైపు యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మరోసారి కీవ్‌పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది.

New Update
Russia attack on Ukraine

Russia Drone Strikes: 

ఉక్రెయిన్‌(Ukraine), రష్యా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా మరోవైపు యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మరోసారి కీవ్‌పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది(Kiev Missile Attack). మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది. ఈ దాడుల్లో కీవ్‌లోని పోలండ్‌ దౌత్యకార్యాలయం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపింది. దాడి జరుగుతున్న సమయంలో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు స్థానికులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్న వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also Read:Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!

Also Read: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!

ఉక్రెయిన్‌తో యుద్ధం(Ukrine war) సహా వివిధ అంశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్‌ గురువారం సుదీర్ఘంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే రష్యా మరోసారి దాడులకు దిగడం గమనార్హం. ఉక్రెయిన్‌లోని 8 ప్రాంతాల్లో రష్యా దాడులు చేసినట్లు కీవ్‌ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 40 అపార్ట్‌మెంట్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. రైల్వే మౌలిక సదుపాయాలకు, పాఠశాలలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపింది. రైల్వే ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ వ్యవస్థ దెబ్బతినడంతో పలు రైళ్లను దారి మళ్లించినట్లు అక్కడి రైల్వే శాఖ వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు