Delhi: వెనక్కి తగ్గిన బీజేపీ సర్కార్.. మోసపోయాం అంటున్న కార్ల యజమానులు

ఢిల్లీలో కొత్త వాహన పాలసీ భయంతో చాలామంది కార్ల యజమానులు చౌకగా తమ వాహనాలు అమ్మేశారు. కానీ ఢిల్లీ సర్కార్‌ ఈ పాలసీని అమలుచేయలేదు. ఈ నిర్ణయం ముందే తీసుకొని ఉంటే తాము తక్కువ రేట్లకు అమ్ముకునేవాళ్లం కాదని యజమానులు బాధపడుతున్నారు.

New Update
Public Anger Wins, Delhi Government Says Won't Scrap Old Cars And Bikes

Public Anger Wins, Delhi Government Says Won't Scrap Old Cars And Bikes Photograph

Delhi: 

ఢిల్లీలో కొత్త వాహన పాలసీ భయంతో చాలామంది కార్ల యజమానులు చౌకగా తమ వాహనాలు అమ్మేశారు. 10 సంవత్సరాలు దాటిన డీజీలు వాహనాలకు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం నింపుకునే అవకాశం ఉండదని ఇటీవల ఢిల్లీ సర్కార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.  జులై 1 నుంచి ఈ పాలసీ అమలు చేస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే చాలామంది కార్ల యజమానులు తక్కువ ధరలకే తమ వాహనాలు అమ్మేశారు. 

Also Read: ప్రియుడితో పెళ్లికి అడ్డు ఉన్నారని..27 మందిని చంపిన యువతి

ఓ వ్యక్తి రూ.82 లక్షలకు కొన్న మెర్సిడిస్ బెంజ్‌ కారును కేవలం రూ.2.5 లక్షలకే అమ్మేసేందుకు ముందుకు వచ్చారు. మరోవ్యక్తి రూ.65 లక్షల జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను రూ.8 లక్షలకే అమ్మేశారు. ఇంకో వ్యక్తి రూ.55 లక్షల లగ్జరీ SUV ని తక్కువ రేటుకే అమ్మేశారు. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఇలా చాలామంది పదేళ్ల పైబడి వాడుతున్న కార్లు, బైకులను తక్కువ రేట్లకే అమ్మేశారు. మరోవైపు ఈ పాలసీపై ఢిల్లీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 

Also Read: అయ్యయ్యో..చూస్తుండగానే నదిలో కొట్టుకుపోయిన గ్యాస్‌ సిలిండర్ల లారీ!

చివరికి ఈ పాలసీని అమలు చేయకముందే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో తక్కువ రేట్లకు తమ వాహనాలు అమ్మేసి మోసపోయామంటూ యజమానులు బాధపడుతున్నారు. ఈ నిర్ణయం ముందే తీసుకొని ఉంటే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని.. తమ వాహనాలు తక్కువ రేట్లకు అమ్ముకునే వాళ్లం కాదని వాపోతున్నారు. 

Also Read: Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు