/rtv/media/media_files/2025/07/05/trump-2025-07-05-06-45-40.jpg)
Donald Trump signs ‘Big Beautiful Bill’ at the White House July 4 picnic
Big Beautiful Bill:
అమెరికా(America) ప్రభుత్వం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) సంతకం చేశారు. పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణ కోసం ఈ బిల్లును ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే దీనిపై సెనెట్‌లో సుధీర్ఘంగా చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రతినిధుల సభలో బిల్లుకు అనుకూలంగా 218 ఓటు వేయగా.. 214 మంది వ్యతిరేకించారు. వీళ్లలో ఇద్దరు రిపబ్లికన్లు కూడా ఉన్నారు.
SIGNED. SEALED. DELIVERED. 🧾🇺🇸
— The White House (@WhiteHouse) July 4, 2025
President Trump’s One Big Beautiful Bill is now LAW — and the Golden Age has never felt better. pic.twitter.com/t0q2DbZLz5
Also Read: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' గతంలో ప్రజలు ఇంత సంతోషంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు. ఈ చట్టం ద్వారా అందరికీ లబ్ధి జరుగుతుంది. సాయుధ బలగాల నుంచి రోజూ కార్మికుల వరకు అందరికీ ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు మద్దతుగా ఉంటుంది. అమెరికా చరిత్రలోనే మా ప్రభుత్వం అతిపెద్ద పన్నుకోత, వ్యయకోత, సరిహద్దు భద్రతలో పెట్టుబడి సాధించిందని'' ట్రంప్ తెలిపారు.
Also Read:వాటిపై రాహుల్ గాంధీ ఫొటో.. రాజకీయంగా రచ్చ రచ్చ
ఇదిలాఉండాగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ట్రంప్ మద్ధతుదారులు, మిత్రపక్షాలు, మిలిటరీ కుటుంబాలు, వైట్ సిబ్బంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేసిన అమెరికా స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. ఇదిలాఉండగా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఇటీవల వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసింది. ఈ చట్టం అమలైతే అమెరికాలో లక్షలాది మంది ఆరోగ్య బీమా కోల్పోతారని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే మరుసటి రోజే ది అమెరికన్ పార్టీ స్థాపిస్తానంటూ ఇటీవల ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Also Read: Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!