/rtv/media/media_files/HIeBNTWz39TjIE66rolk.jpg)
Vande Bharat
Vande Bharat : తక్కువ సమయంలో గమ్యాన్ని చేర్చడానికి వందేభారత్ ట్రైన్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రయాణించే వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ రూట్లో ప్రతిరోజు వందలాది మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. అయితే వారికి తగినట్లు కోచ్‌లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా కోచ్‌లను పెంచాలని నిర్ణయించింది.సికింద్రాబాద్,విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కోచ్‌ల సంఖ్య పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?
ఈ రైళ్ల(20707, 20708)లో ప్రస్తుతం 14 ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు ఉండగా వాటి సంఖ్యను 18కి పెంచినట్లు వెల్లడించింది. రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌ల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయలేదని వివరించింది. ఈ నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి వస్తుందని ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్ శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్-విశాఖపట్నం(20707) వందేభారత్ రైలు ప్రతి రోజు ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
ఇది కూడా చూడండి:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !
తిరిగి విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరే ఈ రైలు (20708) రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని వివరించారు. ఈ నాలుగు రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య నాలుగుకు పెంచినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇందులో ముంబయి-బళ్లార్ష (11001/11002), ముంబయి-చెన్నై సెంట్రల్ (22157/22158), మైసూరు-, రేణిగుంట(22135/22136), కొల్లాపుర్,-నాగ్‌పుర్(11403/11404) రైళ్లు ఉన్నాయి. ఈ కోచ్‌ల పెంపు నిర్ణయం సెప్టెంబరు 5 నుంచి అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని రైల్వే శాఖ వెల్లడించింది.
ఇది కూడా చూడండి:Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు