Viral Vayyari: 'వైరల్ వయ్యారి'.. అంటూ అదరగొట్టిన శ్రీలీల! పాట చూశారా?

కిరీటీ రెడ్డి- శ్రీలీల జంటగా నటించిన 'జూనియర్' నుంచి అదిరిపోయే మాస్ బీట్ రిలీజ్ చేశారు. 'వైరల్ వయ్యారి'.. అంటూ సాగిన ఈ పాటలో శ్రీలీల డాన్స్  స్టెప్పులతో అదరగొట్టింది. అలాగే రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ ప్రేక్షకులకు ఫుల్ ఇచ్చేలా ఆకట్టుకుంటోంది.  

New Update

Viral Vayyari:  ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపార వేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి  'జూనియర్'  అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా జులై 18న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా సినిమా నుంచి అదిరిపోయే మాస్ బీట్ రిలీజ్ చేశారు.  'వైరల్ వయ్యారి'.. అంటూ సాగిన ఈ పాటలో శ్రీలీల డాన్స్  స్టెప్పులతో దుమ్మురేపింది.  విడుదలైన గంటల్లోనే 1 మిలియన్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. 

దేవి ఎనర్జిటిక్ మ్యూజిక్ 

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఎనర్జిటిక్ సంగీతం, క్యాచీ బీట్స్‌తో ఈ పాట చాలా బాగుంది. దేవిశ్రీ ఈ పాటకు సంగీతం అందించడంతో పాటు సింగర్ హరిప్రియతో కలిసి ఆలపించారు కూడా. లిరిక్ రైటర్ కళ్యాణ్ శంకర్  యువతకు సులభంగా కనెక్ట్ అయ్యే సోషల్ మీడియా పదబంధాలను ఉపయోగించి పాటను మరింత ఆకట్టుకునేలా చేశారు. కిరీటి రెడ్డి శ్రీలీల తమ స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నారు. శ్రీలీల తన గ్లామర్,  హావభావాలతో మెరిసిపోయింది. ఆకట్టుకునే సంగీతం, కలర్ఫుల్ విజువల్స్ తో  'వైరల్ వయ్యారి' వైరల్ హిట్ అవుతోందని తెలుస్తోంది.  

రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో  స్టార్ హీరోయిన్  జెనీలియా దేశ్‌ముఖ్ కూడా  ఒక ముఖ్య పాత్రలో నటించింది. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రజని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. 

Also Read: Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు