Amarnath pilgrims: ఢీకొన్న ఐదు బస్సులు.. అమరనాథ్‌ యాత్రలో ప్రమాదం

అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులు ఒకదానికోకటి నాలుగు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగగా.. నాలుగు బస్సులు దెబ్బతిన్నాయి.

New Update
amaranath yatra

అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులు ఒకదానికోకటి నాలుగు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.  చందర్‌కోట్ లంగర్ ప్రాంతంలో  ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగగా.. నాలుగు బస్సులు దెబ్బతిన్నాయి. స్థానిక యంత్రాంగం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వెంటనే ప్రారంభించారు. గాయపడిన వారిని రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.  ఇక దెబ్బతిన్న బస్సులను మార్చడంతో యాత్ర ప్రారంభమైనట్లు చెప్పారు.

Also Read :  వెంకీ- త్రివిక్రమ్ సినిమాకు క్రేజీ టైటిల్!

Also Read :  భారీ అగ్నిప్రమాదం.. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న యువకుడు మృతి

కట్టుదిట్టమైన భద్రత నడుమ

అమర్‌నాథ్ యాత్రికుల ప్రమాదం గురించి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాంబన్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ అలియాస్ ఖాన్‌తో మాట్లాడారు. కాగా అమర్‌నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ  5,880 మందికి పైగా భక్తుల తొలి బ్యాచ్‌ బుధవారం జమ్ము నుంచి బయల్దేరింది.  ఇక  6,979 మంది యాత్రికులతో కూడిన నాల్గవ బ్యాచ్ - 5,196 మంది పురుషులు, 1,427 మంది మహిళలు, 24 మంది పిల్లలు, 331 మంది సాధువులు ఒక ట్రాన్స్జెండర్ - భగవతి నగర్ బేస్ క్యాంప్ నుండి రెండు వేర్వేరు కాన్వాయ్లలో తెల్లవారుజామున 3.30 నుండి 4.05 గంటల మధ్య బయలుదేరారు.

Also Read :  యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం కేసులో ట్విస్ట్ ...అంతా ఉత్తదే..

Also Read :  రవాణా శాఖ సంచలనం...18,973 డ్రైవింగ్‌ లైసెన్సుల సస్పెన్షన్‌

telugu-news | india | Amarnath Yatra | Amarnath pilgrims

Advertisment
Advertisment
తాజా కథనాలు