పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ

రాజస్థాన్‌లో మోనా బుగాలియా 2021లో ఎస్సై ఎగ్జామ్స్‌ రాసింది. క్వాలిఫై కాలేకపోయింది. దీంతో మూలీ దేవి అనే పేరుతో ఫోర్జ్‌డ్‌ డాక్యుమెంట్లు సృష్టించి అకాడమీలో రెండేళ్లు ట్రైనింగ్ తీసుకుంది. తర్వాత అసలు విషయం బయటపడింది.

New Update
Lady Fake SI

జైపూర్‌లోని రాజస్థాన్‌ పోలీస్ అకాడమీలో SIగా రెండేళ్లు శిక్షణ పొందిన మోనా అలియాస్‌ మూలీ దేవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోనా బుగాలియా 2021లో ఎస్సై ఎగ్జామ్స్‌ రాసింది. క్వాలిఫై కాలేకపోయింది. దీంతో మూలీ దేవి అనే పేరుతో ఫోర్జ్‌డ్‌ డాక్యుమెంట్లు సృష్టించి అకాడమీలో ప్రవేశించింది. స్పోర్ట్స్‌ కోటా క్యాండిడేట్‌గా తనను తాను అందరికి పరిచయం చేసుకుంది. అలా అకాడమీ పెద్దలనే బోల్తా కొట్టించి రెండేళ్లపాటు అధికారికంగా శిక్షణ పొందింది. తర్వాత అసలు విషయం బయటపడింది. రెండేళ్లపాటు పరారీలో ఉన్న ఆమెను జూలై 5న సికర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో పోలీస్‌ అకాడమీ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ చేయకుండా ఎలా శిక్షణకు అనుమతించారని మండిపడుతున్నారు పలువురు. 

ఆమె ఎప్పుడూ ప్రధాన గేట్ ద్వారా కాకుండా అధికారుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఉన్న గేట్ ద్వారా అకాడమీకి ప్రవేశించేది. ఈ వీఐపీ ఎంట్రీపై 2023లో కొంతమంది ట్రైనీలకు అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు. విచారణలో అసలు విషయం బయటపడింది. రెండేళ్లపాటు పరారీలో ఉన్న మోనాని సికర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 3 యూనిఫామ్‌లతో పాటు నకిలీ గుర్తింపు పత్రాలు, పోలీస్ అకాడమీకి సంబంధించిన పరీక్షా పత్రాలు స్వాధీనపర్చుకున్నారు. మోనా బుగాలియా స్వస్థలం నాగౌర్ జిల్లా అని, ఆమె తండ్రి లారీ డ్రైవర్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు