/rtv/media/media_files/2025/07/04/boney-kapoor-daughter-anshula-kapoor-got-engaged-2025-07-04-15-12-11.jpg)
Boney Kapoor daughter Anshula Kapoor got engaged
Boney Kapoor Daughter: బాలీవుడ్ నిర్మాత, నటుడు బోనీ కపూర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమార్తె, హీరో అర్జున్ కపూర్ చెల్లి అన్షులా కపూర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జులై 3న తన చిరకాల స్నేహితుడు రోహన్ ఠక్కర్ ని నిశ్చితార్థం చేసుకుంది. ఈ జంట న్యూయార్క్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని అన్షులా కపూర్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దీంతో సెలెబ్రెటీలు, కుటుంబ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చెల్లెల్లు జాన్వీ కపూర్, ఖుషీ.. ''మా అక్క ఎంగేజ్ అయ్యింది'' అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే అన్న అర్జూన్ కపూర్ ''మీ ఇద్దరికీ సంతోషకరమైన జీవితం ఉండాలి. ఈ రోజు అమ్మను కాస్త ఎక్కువగా మిస్సయ్యాను! లవ్ యూ గైస్" అని రాశాడు.
Also Read: Samantha: అతడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా .. సామ్ కామెంట్స్ వైరల్
మాజిక్‌లా ఉంది!
ఈ మేరకు అన్షులా తమ ప్రేమ ప్రయాణాన్ని వివరిస్తూ ఒక భావోద్వేగ నోట్‌ను రాసింది. తమ పరిచయం ఒక అర్ధరాత్రి చాటింగ్‌తో మొదలైందని ఆమె గుర్తుచేసుకుంది. ''ర్యాండమ్ గా ఒక మంగళవారం రోజు మేము 1:15 గంటలకు మేము మాట్లాడటం మొదలుపెట్టాం.. అలా గంటల తరబడి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత, నాకిష్టమైన నగరంలో, సెంట్రల్ పార్క్‌లోని కోట ముందు అదే 1:15 గంటలకే రోహన్ నాకు ప్రపోజ్ చేయడం మాజిక్‌లా అనిపించిందని" ఆమె పేర్కొంది. ఒక డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్న ఈ జంట పరిచయం పెళ్లి పీటల వరకు వెళ్ళింది.
Also Read:Mouni Roy: ఆకుపచ్చ చీరలో నడుమందాలు చూపిస్తూ మౌని గ్లామర్ షో! ఫొటోలకు ఫిదా అవ్వాల్సిందే
ఇదిలా ఉంటే అన్షులా కపూర్ బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరి కూతురు. హీరో అర్జున్ కపూర్ కూడా వీరికి జన్మించిన సంతానమే. 1996లో మొదటి భార్యతో విడాకుల తర్వాత బోనీ కపూర్ నటి శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ జన్మించారు.
Also Read:Tamannaah Bhatia: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. స్టిల్స్ పిచ్చేక్కించేసిందిగా!