KCR : మరోసారి యశోద ఆసుపత్రికి కేసీఆర్.. ఎందుకంటే ?

స్వల్ప అస్వస్థత కారణంగా గురువారం రోజున యశోద  ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బీఆర్ఎస్ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ వైద్యుల సలహామేరకు శనివారం డిశ్చార్జీ అయ్యారు. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం ఆరోగ్యం మెరుగ్గానే ఉందన్నారు.

New Update
kcr-yashoda

స్వల్ప అస్వస్థత కారణంగా గురువారం రోజున యశోద  ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బీఆర్ఎస్ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ వైద్యుల సలహామేరకు శనివారం డిశ్చార్జీ అయ్యారు. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సోడియం లెవల్స్  కొద్దిగా పెరిగాయని,  యశోద వైద్యులు నిర్థారించారు. కాగా వైద్య పరీక్షల్లో భాగంగా ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత, మరోసారి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని యశోద వైద్యులు తెలిపారు.  

Also Read :  ఢీకొన్న ఐదు బస్సులు.. అమరనాథ్‌ యాత్రలో ప్రమాదం

Also Read :  అమెరికాలో నీర‌వ్ మోదీ తమ్ముడు అరెస్టు

Also Read :  ఎడ్జ్‌బాస్టన్‌లో సిరాజ్ అద్భుతం.. 1993 తర్వాత ఇదే మొదటిసారి

మరోసారి యశోద హాస్పటల్ కు

ఈ నేపథ్యంలో రానున్న గురు, శుక్ర వారాల్లో వైద్య పరీక్షల నిమిత్తం మరోసారి యశోద హాస్పటల్ కు కేసీఆర్ వెల్లనున్నారు. కాగా పూర్తి ఆరోగ్యంతో ఉన్న కేసీఆర్ వైద్య పరీక్షల నడుమ విరామ సమయంలో రాష్ట్రంలో సాగునీరు, రైతులు, వ్యవసాయం , తదితర  ప్రజా సమస్యల మీద, గత రెండు రోజులుగా పార్టీ సీనియర్లతో చర్చిస్తూ సమాచారం తీసుకుంటూ తదనుగుణంగా సూచనలిస్తున్నారు.  

కాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే  యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్టు తెలిపారు.  కేసీఆర్ కు బ్లడ్‌ షుగర్‌, సోడియం స్థాయిలను చెక్ చేసేందుకు కొన్ని రోజులు పాటు హాస్పిటల్‌లోనే ఉండాలని వైద్యులు సూచించినట్టుగా తెలిపారు. కేసీఆర్‌కు ఎలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవన్నారు కేటీఆర్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కేసీఆర్ క్షేమం గురించి ఆలోచిస్తూ, ఆరా తీస్తున్న ప్రతి ఒక్కరికి తాను కృతజ్ఞతలు తెలియజేశారు.  

Also Read :  జరగబోయేది ముందే చెప్పే ఫేమస్ జ్యోతిష్యులు వీరే

brs-party | Yashoda Hospital | telangana | kcr

Advertisment
Advertisment
తాజా కథనాలు