congress : కాంగ్రెస్ కార్యకర్త మృతి.. మంత్రి ఉత్తమ్,టీపీసీసీ చీఫ్ సంతాపం!

కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన  కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హజరై తిరిగి వెళ్తుండగా... జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్టంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కొర్రి శ్రీను దుర్మరణం చెందాడు.

New Update
uttam mahesh

కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన  కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హజరై తిరిగి వెళ్తుండగా... జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్టంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కొర్రి శ్రీను దుర్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి కట్టంగూర్ మండలంలోని పామనగుండ్ల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీను కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించిన మంత్రి ఉత్తమ్ ...  ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.

మహేష్ కుమార్ గౌడ్  సంతాపం

ఇక శ్రీను మృతి పట్ల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ కోసం గ్రామ స్థాయిలో విశేషంగా కృషి చేసిన నేతగా ఆయన పాత్రను ఆయన కొనియాడారు. శ్రీను కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మహేష్ కుమార్ గౌడ్...  వారి కుంటుబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రమాద విషయంపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు