Roja Selvamani: ఆ ఒక్కడికి తప్పా అందరికీ కృతజ్ఞత ఉంది.. ఆర్పీపై రోజా షాకింగ్ కామెంట్స్!

జబర్దస్త్ లో ఒక్కడికి తప్పా అందరికీ కృతజ్ఞత ఉంది అంటూ రోజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే రోజా జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీని ఉద్దేశిస్తూనే ఈ కామెంట్స్ చేసినట్లు నెటిజన్లు అనుకుంటున్నారు.

New Update
roja comments on kiraak rp jabardasth

roja comments on kiraak rp jabardasth

Roja Selvamani: జబర్దస్త్ లో ఒక్కడికి తప్పా అందరికీ కృతజ్ఞత ఉంది అంటూ రోజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే రోజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమావాళ్లు కానీ, ఇండస్ట్రీలో ఎవరైనా కానీ.. నాకు పరిచయం ఉన్న వాళ్లందరికీ దర్శనానికి టికెట్లు కావాలంటే నేను తీసిచ్చాను. ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి తీసుకున్నామో అడగండి? నాకు కావాల్సిన వాళ్ళు వస్తే.. వాడు ఎంత చిన్నవాడైన నేను దగ్గరుండి దర్శనం చేయించాను. అలా చూసినోడే ఈరోజు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు. జబర్దస్త్ లో అందరూ తిరుపతి దర్శనానికి వచ్చినవారే,  మా ఇంటికి వచ్చిన వారే! కానీ అందులో ఒకడికి తప్పా అందరికీ  కృతజ్ఞత ఉంది. వాడికి ఖచ్చితంగా  దేవుడు పనిష్మెంట్ అనేది ఇస్తాడు అని అన్నారు. 

Also Read:Naga Chaitanya NC24: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!

కృతజ్ఞత లేని ఆర్పీ 💦

Posted by Swathi Ysrcp on Friday, July 4, 2025

కిర్రాక్ ఆర్పీ

అయితే రోజా జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీని ఉద్దేశిస్తూనే ఈ కామెంట్స్ చేసినట్లు నెటిజన్లు అనుకుంటున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో మంత్రి రోజా, కిర్రాక్ ఆర్పీ   మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆర్పీ  జనసేనకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గతంలో రోజా  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Also Read: Oh Bhama Ayyo Rama: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు