Oh Bhama Ayyo Rama: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!

హీరో సుహాస్, మాళవిక మనోజ్‌ జంటగా రామ్‌ గోదల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామా’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కామెడీ, ఎమోషనల్‌ సన్నివేశాలతో ట్రైలర్ అదిరిపోయింది. ఈ మూవీలో అనిత హస్సానందాని, అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

New Update
Oh Bhama Ayyo Rama:  యంగ్ హీరో సుహాస్- మాళవిక మనోజ్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఓ భామ అయ్యో రామా' జులై 11న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. కామెడీ, ఎమోషన్ కలగలిపిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో సుహాస్ రామ్ పాత్రలో కనిపించగా.. మాళవిక సత్యభామ పాత్రలో కనిపించింది.   సుహాస్ ఎప్పటిలాగే తనదైన శైలిలో ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించాడు. వీరిద్దరి మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయించాయి. అలాగే ట్రైలర్ మధ్యలో హరీష్ శంకర్, మారుతి వంటి స్టార్ డైరెక్టర్ల అందరిలో ఆసక్తిని పెంచింది. 

సీనియర్ నటి అనిత రీ ఎంట్రీ  

ఇందులో సీనియర్ నటి  అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథివీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాత్విక్ ఆనంద్, నాయని పావని, తదితరులు కీలక పాత్రలు పోషించారు సీనియర్ నటి  అనిత చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇస్తోంది. అనిత ఉదయ్ కిరణ్ 'నువ్వు నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. రామ్‌ గోదాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్ పై హర్ష నల్ల నిర్మించారు.

ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ తో పాటు సుహాస్ మరో రెండు  సినిమాలు చేస్తున్నాడు.  కేబుల్ రెడ్డి, ఆనంద్ రావు అడ్వెంచర్స్, సినిమాలతో బిజీగా ఉన్నాడు.  ప్రస్తుతం ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లతోనూ అలరిస్తున్నారు సుహాస్. ఇటీవలే కీర్తిసురేష్- సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్ టైనర్ 'ఉప్పు కప్పురంబు' ఓటీటీలో విడుదలవగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. పల్లెటూరు నేపథ్యంలో సాగిన ఈ సీరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  ప్రస్తుతం ఈ  సీరీస్  అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Also Read: Accident News: పెళ్ళికి వెళ్తుండగా ఘోరం.. వరుడితో సహా 5 మంది స్పాట్ డెడ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు