Julian McMahon: క్యాన్సర్‌తో మార్వెల్ నటుడు కన్నుమూత!

హాలీవుడ్ యాక్టర్ జులియన్ మెక్‌మహన్(56) క్యాన్సర్‌తో మృతి చెందినట్లు తన భార్య కెల్లీ వెల్లడించారు. జులియన్ మార్వెల్ మూవీస్ ఫెంటాస్టిక్ ఫోర్‌లో Dr.డూమ్‌గా పాపులర్ చెందారు.

New Update
marvel actor

marvel actor

Julian McMahon: ప్రముఖ హాలీవుడ్ నటుడు జూలియన్ మెక్‌మహాన్ 56 ఏళ్ల వయసులో   కన్నుమూశారు.  కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన జులై 2న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన భార్య కెల్లీ మెక్‌మహాన్ ధృవీకరించారు. దీంతో సినీ నటులు, ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. 

Dr.డూమ్‌గా పాపులర్

జూలియన్ మెక్‌మహాన్ మార్వెల్ మూవీస్ ఫెంటాస్టిక్ ఫోర్‌లో Dr.డూమ్‌గా పాపులర్ చెందారు. అంతేకాకుండా చార్మ్డ్, నిప్/టక్,  ఎఫ్‌బీఐ: మోస్ట్ వాంటెడ్, వంటి పాపులర్ టీవీ షోలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన తండ్రి, బిగ్గీ మెక్‌మహాన్, ఒకప్పుడు ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు.

Also Read: Viral Vayyari: 'వైరల్ వయ్యారి'.. అంటూ అదరగొట్టిన శ్రీలీల! పాట చూశారా?

జూలియన్ మెక్‌మహాన్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మరణం హాలీవుడ్ పరిశ్రమకు ఒక పెద్ద లోటు. ఆయన కుటుంబానికి,  అభిమానులకు ఇది తీరని విషాదం.

Advertisment
Advertisment
తాజా కథనాలు