Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న యువకుడు మృతి

ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాల్ మెగా మార్ట్‌ మాల్ లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం సమయంలో కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ (25) లిఫ్ట్‌లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతడు పీజీలో ఉంటూ సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు.

New Update
delhi karol bagh fire breaks out in vishal mall one died

delhi karol bagh fire breaks out in vishal mall one died

ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాల్ మెగా మార్ట్‌ మాల్ లో మంటలు అంటుకున్నాయి. దీంతో భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. బేస్‌మెంట్, గ్రౌండ్ +3, పైన ఉన్న కొన్ని రూమ్‌లు కూడా కాలిపోయాయి. అంతేకాకుండా అగ్నిప్రమాదం సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!

లిఫ్ట్‌లో చిక్కుకుని మృతి

ఈ ఘోరమైన ప్రమాదంలో ఓ వ్యక్తి లిఫ్ట్‌లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ (25) లిఫ్ట్‌లో చిక్కుకున్నట్లు గుర్తించారు. అనంతరం అతడిని సమీపంలో ఉన్న హాస్పిటల్‌కు తరలించారు. అంతలోపే ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Also Read :  నీరు తాగుతున్నా కూడా డీహైడ్రేషన్ ఆ.. ఈ లోపం కారణమేమో చూడండి

మరోవైపు మంటలను అదుపు చేందుకు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం ఎగసిపడిన మంటలను అదుపు చేసింది. ఈ ఘటనపై కరోల్ బాగ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Also Read :  వెంకీ- త్రివిక్రమ్ సినిమాకు క్రేజీ టైటిల్!

సివిల్స్‌కు ప్రిపేర్ అయిన యువకుడు

ఈ అగ్నిప్రమాదంలో మరణించిన యువకుడి పేరు కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్. అతడు సోన్ భద్ర నివాసి. 5 సంవత్సరాలుగా ఢిల్లీలో ఉంటూ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్నాడు. అతడు కరోల్ బాగ్ లోని ఒక పీజీలో ఉంటున్నాడు. ఈ ప్రమాదంలో తమ కుమారుడు ప్రాణాలు కోల్పోవడం పట్ల మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇది నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆవేదన చెందారు. తమ కుమారుడిని సకాలంలో అక్కడి నుండి బయటకు తీసి ఉంటే ప్రాణాలు ఉండేవని కన్నీరు మున్నీరయ్యారు. 

crime news | fire accident | Latest crime news

Advertisment
Advertisment
తాజా కథనాలు