/rtv/media/media_files/2025/07/05/a-young-woman-killed-27-people-2025-07-05-07-13-59.jpg)
A young woman killed 27 people
Pakistan : తాము కోరుకున్నది దక్కించుకోవడానికి మనుషులు ఎంతకైన తెగిస్తున్నారు. అందుకు అడ్డు వస్తే తల్లి, తండ్రి, పిల్లలు ఇలా ఎవరినైనా సరే అంతమొందిస్తున్నారు. ఇటీవల వరుసగా ఇవే ఘటనలు ఎదురవుతున్నాయి. తన ప్రియుడితో పెళ్లికి తల్లి అడ్డంగా ఉందని భావించి తల్లినే చంపిందో పదవతరగతి విద్యార్థిని. ఇలాంటి ఘటనే పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఏకంగా 27 మంది కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకుందో యువతి. పాకిస్థాన్‌లో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read:Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!
పాకిస్తాన్ ముజఫ్ఫర్‌గఢ్‌కు చెందిన అసియా బీబీ అనే యువతికి కుటుంబ సభ్యులు పెళ్లి సెటిల్ చేశారు. అయితే ఆ పెళ్లి ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదు. కారణం తనకు భాయ్ ఫ్రెండ్ ఉండడమే. దీంతో చాలా కఠిన నిర్ణయం తీసుకుంది. ఏకంగా కుటుంబంలోని 27 మందికి విషం పెట్టి చంపేసింది. తనకు పెళ్లి ఫిక్స్ చేసిన సమయంలోనే ఆ పెళ్లి నాకు ఇష్టం లేదని నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని అసియా బీబీ చెప్పింది. ఆయనతో తన పెళ్లి చేయాలని కూడా కోరింది. అయితే కుటుంబసభ్యులు మాత్రం తమ బంధువు అయిన అజ్మద్‌తో మ్యారేజ్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ విషయంలో అసియా బీబీ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. తనకు ఇష్టం లేని పెళ్లిచేస్తే ఏమైనా చేస్తానని హెచ్చరంచింది. అయినా కుటుంబ సభ్యులు వినలేదు. దీంతో కుటుంబ సభ్యులు తాగే పాలల్లో ఎలుకల మందు కలిపింది.
Also Read: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!
తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోలేనని నిర్ణయించుకున్న అసియా బీబీ తనను పెళ్లి చేసుకోబోయే అజ్మద్‌తో సహా అందరికీ విషం కలిపిన పాలు ఇచ్చింది. దీంతో వారంతా అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో అజ్మద్‌తోసహా 18 మంది అస్వస్థతకు గురయ్యారు.. వారిలో అజ్మద్ అన్నలు, వదినలతో సహా తొమ్మిది మంది మరణించినట్లు తెలిసింది. అయితే ఈ ఘటన జరిగి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్న ఘటనల నేపథ్యంలో మరోసారి ట్రెండింగ్‌గా మారింది. కాగా ఈ కేసులో అసియాబీబీతో పాటు ఆమె ప్రియుడు షాహిద్ హస్తం కూడా ఉందని తేలింది. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: కెచప్‌తో రోటీ పరోటా పిల్లలకు ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?