Fish Venkat: నటుడు ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు ఫెయిల్ అవడంతో గత కొద్దిరోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తమను ఆదుకోవాలంటూ టాలీవుడ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభాస్ టీమ్.. ఫిష్ వెంకట్ కుటుంబానికి కాల్ చేశారని, ఆపరేషన్ కి అవసరమయ్యే ఖర్చంతా ప్రభాస్ భరిస్తారని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి ఈ వార్తలపై స్పందించింది. ప్రభాస్ నుంచి సహాయం అందిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వీడియో రిలీజ్ చేసింది.
Also Read:Viral Vayyari: 'వైరల్ వయ్యారి'.. అంటూ అదరగొట్టిన శ్రీలీల! పాట చూశారా?
రెండు కిడ్నీలు పాడయిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాక్టర్ ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సాయం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన కూతురు చెబుతున్నారు. ప్రభాస్ పీఏ అని ఒకరు కాల్ చేశారు. వివరాలు తెలుసుకొని సాయం చేస్తా అన్నారు కానీ, ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సాయం… pic.twitter.com/iGNbSMgaGy
— RTV (@RTVnewsnetwork) July 5, 2025
ఎలాంటి సహాయం అందలేదు!
వీడియోలో స్రవంతి మాట్లాడుతూ.. ప్రభాస్ PA అంటూ ఒకరు కాల్ ఓ వ్యక్తి కాల్ చేసి సహాయం కావాలా అని అడిగాడు. అవును.. అని చెప్పడంతో వివరాలు తెలుసుకొని సహాయం చేస్తా అని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి సహాయం చేయలేదు. తిరిగి ఆ నంబర్‌కు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు! దయచేసి ఫేక్ కాల్స్‌తో కాలయాపన చేయొద్దు. మా నాన్న ఆరోగ్యం రోజురోజుకూ క్షీణీస్తోంది అని వాపోయింది. ఇలా చేయడం వల్ల సహాయం చేసేవారు కూడా ముందుకు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే ఫిష్ వెంకట్ గత నాలుగేళ్లుగా డయాలసిస్‌పైనే జీవిస్తున్నారట. కొంతకాలంగా పరిస్థితి మరింత క్షీణించడంతో బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆపరేషన్ కి సుమారు రూ. 50 లక్షలు ఖర్చవుతుందని ఆయన కూతురు స్రవంతి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:Oh Bhama Ayyo Rama: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!