/rtv/media/media_files/2025/07/05/russia-ukraine-war-2025-07-05-07-47-29.jpg)
Russia-Ukraine War
Russia-Ukraine War:
ఉక్రెయిన్ పై రష్యా తన దాడిని ఇప్పట్లో అపేలా లేదు. అదే విషయాన్ని పుతిన్(Putin) స్పష్టం చేశారు. యుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పై యుద్ధం ఆపేది లేదని కన్ఫామ్ చేశారు. ఉక్రెయిన్ పై జరుపుతున్న దాడులపై స్పందిస్తూ యుక్రెయిన్ లో నో ఫ్లై జోన్ విధించే ఏ ప్రయత్నమైనా… సంఘర్షణకు తావిచ్చినట్లేనని అన్నారు. దాంతో పాటుగా లక్ష్యం నెరవేరే వరకూ యుద్ధం ఆగదని, ఎంతో ఆలోచించాకే ఉక్రెయిన్ పై దాడి మొదలుపెట్టామని స్పష్టం చేశారు.‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ అణ్వాయుధాలకు నిలయంగా ఉండదు. శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించింది. ఊహించిన దాని కంటే యుద్ధం భీకరంగా సాగింది’ అని తెలిపారు.
Also Read:రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!
ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.ఈ విషయమై ట్రంప్‌తో గంటసేపు ఫోన్‌లో మాట్లాడిన పుతిన్ కాల్పుల విరమణకు రష్యా సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. "ఇరువురు నాయకులు యుద్ధం గురించి చర్చించుకున్నారు. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని ట్రంప్ సూచించినా, పుతిన్ తిరస్కరించారు’’ అని క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉష్కోవ్ వెల్లడించారు. పుతిన్‌తో జరిగిన ఫోన్ సంభాషణపై ట్రంప్ నిరాశ వ్యక్తంచేశారు. ‘‘ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పుతిన్ ఆపేలా లేరు. ఈ విషయంలో ఆయన పట్ల నేను తీవ్ర నిరాశ చెందాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!
ప్రకటించినట్లే ఉక్రెయిన్‌లోని కీవ్ సహా 13 ప్రదేశాలు లక్ష్యంగా భారీగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఏకంగా 11 క్షిపణులను, 550 డ్రోన్లను ఉక్రెయిన్ పైకి పంపింది. అయితే వీటిలో 270 డ్రోన్లను, 2 క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని ఉక్రెయిన్ ప్రకటించింది.ఈ దాడుల్లో 23 మంది గాయపడ్డారు. ఇక దాడిలో కీవ్‌లోని పోలండ్ దౌత్య కార్యాలయం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. పలు నివాస భవనాలు సైతం ధ్వంసమైనట్లు తెలిపింది.
Also Read: Samantha: అతడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా .. సామ్ కామెంట్స్ వైరల్
ఇక ఈ యుద్ధంలో రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు నెదర్లాండ్స్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ వెల్లడించింది. కీవ్ సైనికులను ఉక్కిరిబిక్కిరి చేసి చంపేందుకు మాస్కో వీటిని ఉపయోగిస్తోందని డచ్ రక్షణ మంత్రి రూబెన్ బ్రెకెల్‌మాన్స్‌ఆరోపించారు. ఈ రసాయన ఆయుధాల కారణంగా ఉక్రెయిన్‌లో ముగ్గురు మరణించారని, దాదాపు 2,500 మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారుల నివేదిక తెలిపింది. రష్యా ఈ రసాయన ఆయుధాలను వినియోగించడం సరికాదని, వీటి ఉపయోగం ఇతర దేశాలకు హానికరమేనని చెప్పారు. ఇలా రసాయన ఆయుధాలను వినియోగించడం నేరమని, ఆ దేశంపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వశాఖ స్పందిస్తూ.. తాము ఎలాంటి రసాయన ఆయుధాలను ఉపయోగించలేదని తేల్చి చెప్పింది.
Also Read:Mouni Roy: ఆకుపచ్చ చీరలో నడుమందాలు చూపిస్తూ మౌని గ్లామర్ షో! ఫొటోలకు ఫిదా అవ్వాల్సిందే