/rtv/media/media_files/2025/05/18/nTyjLljztrM2MHwZw5VJ.jpg)
Earthquake
Earthquake in America: అమెరికాలో భూకంపం సంభవించింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో నమోదవుతున్న భూ కంపాలు పెను సంచలనంగా మారుతున్నాయి. అమెరికాతో పాటు అర్జెంటీనా, పెరూ, ఫిలిప్పైన్స్‌లో కూడా భూ కంపాలు నమోదవుతున్నాయి. దీంతో యుగాంతం దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం సాగుతోంది. వరుస భూకంపాల నేపథ్యంలో బాబా వంగా జోస్యంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అమెరికాలో వరుసగా స్వల్ప భూ కంపాలు నమోదవుతున్నాయి. టెక్సాస్, కాలిఫోర్నియాలలో భూమి కదులు తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.అర్జెంటీనా, పెరూ, ఫిలిప్పైన్స్‌లో కూడా భూ కంపాలు నమోదవుతున్నాయి. థైవాన్‌లో నూ భూమి కంపించింది.
మరోవైపు జపాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. టొకార దీవుల సమూహంలో గత రెండు వారాలుగా భూమి నిరంతరం కంపిస్తూనే ఉంది. జూన్ 21 నుంచి ఇప్పటివరకు అక్కడ ఏకంగా 900 సార్లు భూప్రకంపనలు నమోదవడంతో తీవ్ర ఆందోళన కలుగుతోంది. సగటున గంటకు మూడుసార్లకు పైగా భూమి కంపిస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.
బుధవారం కూడా ఇదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కాసేపటికే వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ వరుస పరిణామాలతో అప్రమత్తమైన యంత్రాంగం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జపాన్ వాతావరణ సంస్థ అధికారి అయాటకా ఎబిటా ఈ వివరాలను ధృవీకరించారు.
జూన్ 23న ఒక్కరోజే అత్యధికంగా 183 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. "నిరంతరం భూమి కదులుతున్నట్లే అనిపిస్తోంది, ఏం జరుగుతుందోనని భయంగా ఉంది" అని ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. టొకార దీవుల్లో జనాభా తక్కువగా ఉండటం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఇక్కడ మొత్తం 12 దీవులు ఉండగా, ఏడింటిలో మాత్రమే సుమారు 700 మంది ప్రజలు నివసిస్తున్నారు.తాజాగా 5.5 భూకంపం రిక్టారు స్కేలుపై నమోదు అయింది. దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. వరుస భూంకపాల నేపథ్యంలో యుగాంతం తప్పదని ప్రచారం సాగుతోంది. బాబా వంగా చెప్పిన జోస్యం నిజమవుతుందన్న ప్రచారం సాగుతోంది.