/rtv/media/media_files/2025/07/05/ttd-devotees-2025-07-05-18-19-56.jpg)
తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2025 జులై 15,16వ తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. శ్రీవారి ఆలయంలో జులై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా టీటీడీ తెలిపింది. అందువల్ల బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లుగా వెల్లడించింది. అంతేకాకుండా 14,15వ తేదీల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే సిఫార్సులు స్వీకరిస్తామంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించవలసినదిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Also Read : ఇట్స్ అఫీషియల్.. అనుష్క ఘాటీ మళ్ళీ వాయిదా!
Also Read : వంట చేసేటప్పుడు చేసే ఈ పొరపాటు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి తెలుసా!?
నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలి
మరోవైపు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలసి అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీలో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుత్తేదారులలో అలసత్వం లేకుండా ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నివేదిక సమర్పించాలని కోరారు.
Also Read : బీచ్ లో చెమటలు పట్టిస్తున్న ఆశు.. ఫొటోలు చూస్తే అంతే!
టిటిడిలో దళారి వ్యవస్థ, నకిలి టికెట్ల పేరుతో సేవల టికెట్ల అమ్మకాలు, అవినీతిపై మరింత నిఘా ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు మరింత నాణ్యంగా, వేగంగా సేవలు అందించేందుకు అలిపిరి టోల్ గేట్ ప్లాజా వద్ద చెకింగ్ పాయింట్ విస్తరణ, లేటెస్ట్ కెమెరాల ఏర్పాటు, వాహనాలు, లగేజీ స్కానింగ్ యంత్రాలు, సెక్యూరిటీ పెంచే అంశం తదితర అంశాలపై టిటిడి సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఐటీ అధికారులు అంతర్జాతీయ విమానాశ్రయాలలో సౌకర్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు.
Also Read : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!
Andhra Pradesh | tirumala | ttd