🔴Live News Updates: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

DSC: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్!

జులై 1, 2 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు రాయనున్న అభ్యర్థులు హాల్ టికెట్లను apdsc.apcfss.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చుని విద్యాశాఖ తెలిపింది. ఈ నియామక పరీక్షలు జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సి ఉండగా, యోగా దినోత్సవం కారణంగా వాయిదా వేశారు.

 

ap dsc exams 2025  preliminary key released today
ap dsc 

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నుండి డీఎస్సీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు బిగ్ అలర్ట్. జులై 1, 2 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు రాయనున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను apdsc.apcfss.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని విద్యాశాఖ తెలిపింది. మెగా డీఎస్సీ 2025 నియామక పరీక్షలు జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సి ఉండగా, యోగా దినోత్సవం కారణంగా వాయిదా వేశారు. ఈ పరీక్షలను జులై 1, 2 తేదీల్లో నిర్వహించనుండగా, వీటి కోసం కొత్త హాల్ టికెట్లను విడుదల చేశారు. పరీక్ష కేంద్రాలు, తేదీలు అన్ని మారడం వల్ల ప్రతీ ఒక్కరూ కూడా కొత్త హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాలని అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత

ఇదిలా ఉండగా ఈ పరీక్షలకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడంతో ఆయా రాష్ట్రాల్లో కూడా పరీక్షలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్ జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. 

ఇది కూడా చూడండి: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

ప్రాథమిక కీ తేదీ

ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉంటుంది. లాస్ట్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత 2వ రోజు నుంచి ప్రాథమిక కీ రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటి కోసం 7 రోజుల సమయం ఇవ్వనున్నారు. ఇక అభ్యంతరాలు పూర్తైన తేదీ నుంచి మరో 7 రోజుల తర్వాత ఫైనల్ కీ రిలీజ్ చేయనున్నారు. ఇలా ఫైనల్ కీ రిలీజ్ చేసిన 7 రోజుల్లో DSC రిజల్ట్స్ ప్రకటించనున్నారు. 

ఇది కూడా చూడండి: CM Chandrababu Naidu: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. ఆ 15 మంది ఎమ్మెల్యేపై చర్యలు!

  • Jun 30, 2025 20:56 IST

    ఈ అర్ధరాత్రి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు..

    ఈ అర్థరాత్రి నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమలుకాబోతున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. అలాగే టికెట్‌బుకింగ్‌ నిబంధనలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ తప్పనిసరి చేస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. 

     

    South Central Railway Introduces New Public Timetable
    South Central Railway Introduces New Public Timetable

     



  • Jun 30, 2025 20:54 IST

    ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్

    టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా ఆడబోతున్నాడు. మొదటి టెస్ట్‌ ఓటమి కారణంగా జట్టు యాజమాన్యం బుమ్రాను ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ డోస్‌చేట్ తెలిపారు.

     

    bumrah to play 2nd test against england in edgbaston
    bumrah to play 2nd test against england in edgbaston

     



  • Jun 30, 2025 20:05 IST

    హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో దంచికొడుతున్న వాన

    హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో బీభత్సం సృష్టిస్తోంది. జూబ్లీహిల్స్, వెంకటగిరి, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, గోల్కొండ, మియాపూర్, మెహిదీపట్నం సహా మరిన్ని ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది.

     

    Hyderabad Rain falling
    Hyderabad Rain falling Photograph: (Hyderabad Rain falling)

     

     

     

     



  • Jun 30, 2025 18:17 IST

    నల్గొండ జిల్లా గుర్రంపోడులో మహిళపై అత్యాచారం.. చంపేందుకు యత్నించి..

    నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనుత్తల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఒక మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆమెను చంపేందుకు యత్నించి పోలీసులకు చిక్కాడు. ఆమెను ఆసుపత్రిలో చేర్చగా మరణించడంతో కలకలం రేగింది.

    Woman raped and killed



  • Jun 30, 2025 17:44 IST

    వామ్మో! చేపలు తినేవాళ్లు జాగ్రత్త.. మెడ నుంచి బయటకొచ్చిన ముళ్ళు!

    చేపలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేదానికి ఈ సంఘటన ఓ భయంకరమైన ఉదాహరణ!  ఓ మహిళ చేపల సూప్ తాగేటప్పుడు గొంతులో ఇరుక్కుపోయిన ముళ్ళు  కొన్ని వారాల తర్వాత మెడ నుంచి బయటకు వచ్చింది.

     

    fish bone breaks through neck
    fish bone breaks through neck

     



  • Jun 30, 2025 17:44 IST

    ప్రియుడితో సహజీవనం.. కన్నపిల్లల్ని పురిట్లోనే చంపేసి..

    కేరళలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఓ యువతి పెళ్లి కాకుండానే తల్లయింది. ఆ పుట్టిన పిల్లల్ని పురిట్లోనే చంపేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో పోలీసులు ఆమెతో పాటు ప్రియున్ని అదుపులోకి తీసుకున్నారు.

    KERALA CHILDRENS KILLED



  • Jun 30, 2025 17:43 IST

    తిరుమల ఘాట్‌లో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

    తిరుమల ఘాట్‌ రోడ్డులో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో 24వ మలుపు వద్ద బస్సు బైక్‌ను ఢీకొని అరీఫా అనే మహిళ మృతి చెందగా.. ఆమె భర్త సురేష్‌, కుమారుడు షామీర్‌ సురక్షితంగా బయటపడ్డారు.



  • Jun 30, 2025 16:41 IST

    మోదీ మీకో దండం, మీ పార్టీకో దండం: రాజాసింగ్!

    బీజేపీకి రాజీనామా చేసిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. మీకో దండం మీ పార్టీకో దండం అంటూ బీజేపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  తెలంగాణలో అధికారంలోకి రావాలని తాను ఎంతో పోరాడుతున్నానన్నారు.

    Untitled



  • Jun 30, 2025 16:21 IST

    బీజేపీకి రాజాసింగ్ రాజీనామా!

    గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.

     

    Raja Singh
    Raja Singh

     



  • Jun 30, 2025 14:51 IST

    ‘కన్నప్ప’ పైరసీపై మంచు విష్ణు ఎమోషనల్

    ‘కన్నప్ప’ పైరసీపై మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘మా సినిమా పైరసీ బారిన పడింది. ఇప్పటికే 30వేలకు పైగా అక్రమ లింక్‌లు తొలగించాం. ఇది ఎంతో బాధాకరమైన విషయం. పైరసీ అనేది నిజానికి ఒక దొంగతనం. పైరసీ కంటెంట్‌ని ప్రోత్సహించవద్దు’’ అని రాసుకొచ్చాడు.

     

    Kannappa Piracy manchu vishnu
    Kannappa Piracy manchu vishnu

     

     



  • Jun 30, 2025 14:49 IST

    కర్ణాటక సీఎం మార్పుపై సంచలన అప్‌డేట్‌

    కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే సోమవారం స్పందించారు. సిద్ధరామయ్యే సీఎంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని స్పష్టం చేశారు.

     

    CM Siddaramaiah
    CM Siddaramaiah

     



  • Jun 30, 2025 13:41 IST

    Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

    బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. 21 ఏళ్ల హిందూ మహిళపై ఓ లోకల్ రాజకీయ నేత అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు.

     

    Massive protest in Bangladesh after Hindu woman raped by local politician
    Massive protest in Bangladesh after Hindu woman raped by local politician

     



  • Jun 30, 2025 11:59 IST

    TG News: వివాహేతర సంబంధం .. రిసార్ట్‌లో బావ, మరదలు ఆత్మహత్య!

    యాదాద్రి భువనగిరి జిల్లా రాగాల రిసార్ట్స్ లో  ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు చేసుకున్న వీరిద్దరూ బావ మరదలని   తెలిసింది. 

     

    Yadadri incident
    Yadadri incident

     



  • Jun 30, 2025 10:54 IST

    AP News: తిరుపతిలో ఘోరం.. కారులో ఇద్దరి యువకుల డెడ్ బాడీలు లభ్యం !

    తిరుపతి జిల్లా తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారులో ఇద్దరి యువకుల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

     

    Tirupati two men found dead in car
    Tirupati two men found dead in car

     



  • Jun 30, 2025 10:47 IST

    Viral Video: మాకెందుకు ఈ దరిద్రం.. అర్ధనగ్నంగా వీధుల్లోకి బాలీవుడ్ బ్యూటీ

    బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ తన రోత డ్రెస్సింగ్ స్టైల్ ప్రస్తుతం  సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఆమె  పాపరాజీ ఫోటో లుక్స్ వైరల్ అవగా.. అందులో ఆమె డ్రెస్ చూసి అంతా షాకయ్యారు.

     

    khushi mukherjee VIRAL VIDEO
    khushi mukherjee VIRAL VIDEO

     



  • Jun 30, 2025 10:40 IST

    BIG BREAKING: హైదరాబాద్‌ భారీ పేలుడు.. 10 మంది మృతి

    హైదరాబాద్‌లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో 10 మంది కార్మికులు స్పాట్‌లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

     

    BREAKING NEWS
    BREAKING NEWS

     



  • Jun 30, 2025 09:31 IST

    Murder: భార్యపై కత్తితో దాడి.. అడ్డొచ్చిన అత్తమామలనూ నరికి చంపిన అల్లుడు

    తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. అడ్డొచ్చిన అత్తమామలనే నరికేశాడు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు.

     

    Death
    Death

     



  • Jun 30, 2025 09:30 IST

    TGSRTC: ఆర్టీసీలో తగ్గుతున్న ఉద్యోగులు.. డ్రైవర్లే కండక్టర్లుగా !

    గతంలో ఏసీ, సూపర్‌ లగ్జరీ లాంటి నాన్‌స్టాప్‌ బస్సుల్లోనే ఈ విధానం ఉండేది. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌లలో కూడా డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే బాధ్యతలు అప్పగిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. కండక్టర్ల కొరత ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి.

     

    TGSRTC Express Bus
    TGSRTC Express Bus

     



  • Jun 30, 2025 09:28 IST

    Maharastra: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!

    మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో చాక్లెట్ కొనడానికి నాలుగేళ్ల కూతురు తండ్రికి డబ్బులు అడిగింది. మద్యానికి బానిసైన ఆ తండ్రి తన నాలుగేళ్ల కూతురిని చీర కొంగుతో గొంతు కోసి అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

     

    Maharastra
    Maharastra

     



  • Jun 30, 2025 09:28 IST

    Weather Update: తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన వర్షాలు.. అధికారుల హెచ్చరికలు

    నైరుతి రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నట్లు తెలిపింది.

     Heavy rains in Telangana.
    Heavy rains in Telangana.

     



  • Jun 30, 2025 09:27 IST

    Cashless Treatment Scheme: కేంద్రం కొత్త పథకం.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు..!

    గాయపడితే ఉచితంగా చికిత్స తీసుకోవడం కుదరదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నగదు రహిత వైద్య సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.లక్షన్నర వరకు నగదు రహిత వైద్యాన్ని అందించే పథకాన్ని తీసుకురావాలని చూస్తోంది.

    Road Accident



  • Jun 30, 2025 07:31 IST

    BREAKING: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

    అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కురబలకోట మండలంలోని దొమ్మన్న బావీ వద్ద టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.

     

    BREAKING NEWS
    BREAKING NEWS

     



  • Jun 30, 2025 07:31 IST

    Jharkhand Heavy Rains: ఝార్ఖండ్‌లో భారీ వరదలు.. చిక్కుకున్న 162 మంది విద్యార్థులు

    ఝార్ఖండ్‌లోని సింగ్బూమ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఆశ్రమ పాఠశాల మునిగింది. దాదాపుగా 162 విద్యార్థులు ఈ పాఠశాల భవనంలో చిక్కుకున్నారు. వెంటనే అధికారులు స్థానికుల సాయంతో వారిని రక్షించారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి.

    Jharkhand Rains



  • Jun 30, 2025 07:30 IST

    Jelly Fish in Beach: ఆంధ్ర తీరంతో జెల్లీ ఫిష్‌ల కలకలం.. భయాందోళనలో పర్యాటకులు

    ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో జెల్లీ ఫిష్‌లు కలకలం రేపుతున్నాయి. ఈ విష పురుగులు పెద్దఎత్తున తీరంలో ఉంటున్నాయి. ‘అగ్గిబాటా’ అని పిలిచే వీటిని పొరపాటున తాకినా సమస్యలు తప్పవని స్థానికులు అంటున్నారు.

     

    Jelly fish
    Jelly fish

     



  • Jun 30, 2025 06:57 IST

    BJP అధ్యక్ష పదవి.. రామ్ చందర్ రావు , ఈటలలో ఒకరికే అవకాశం

    బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకరు ఎంపీ ఈటల రాజేందర్, మరొకరు మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావు. వీళ్లిద్దరిలోనే ఒకరికి అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ ఉందని సమాచారం.

     

    BJP
    BJP

     



  • Jun 30, 2025 06:56 IST

    Jelly Fish in Beach: ఆంధ్ర తీరంతో జెల్లీ ఫిష్‌ల కలకలం.. భయాందోళనలో పర్యాటకులు

    ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో జెల్లీ ఫిష్‌లు కలకలం రేపుతున్నాయి. ఈ విష పురుగులు పెద్దఎత్తున తీరంలో ఉంటున్నాయి. ‘అగ్గిబాటా’ అని పిలిచే వీటిని పొరపాటున తాకినా సమస్యలు తప్పవని స్థానికులు అంటున్నారు.

     

    Jelly fish
    Jelly fish

     



Advertisment
Advertisment
తాజా కథనాలు