/rtv/media/media_files/2025/06/30/fish-bone-breaks-through-neck-2025-06-30-17-07-30.jpg)
fish bone breaks through neck
Viral News: చేపలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేదానికి ఈ సంఘటన ఓ భయంకరమైన ఉదాహరణ! ఓ మహిళ చేపల సూప్ తాగేటప్పుడు గొంతులో ఇరుక్కుపోయిన ముళ్ళు కొన్ని వారాల తర్వాత మెడ నుంచి బయటకు వచ్చింది. ఈ ఘటన ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచింది!
వివరాల్లోకి వెళితే .. కొన్ని వారాల క్రితం ఫేస్‌బుక్ యూజర్ సూర్యన్ బుప్పా-ఆర్ట్ భార్య సంగ్ ఒక గిన్నెలో ఇంట్లో తయారు చేసిన చేపల పులుసు తాగుతుండగా.. అనుకోకుండా ముల్లును మింగేసింది. దీంతో ఆమె వెంటనే ముల్లును లోపలి నెట్టడానికి ప్రయత్నించింది. అన్నం ముద్ద తినడం, ఇతర ఇంటి చిట్కాలను ట్రై చేసింది. అయినప్పటికీ అవి పనిచేయలేదు.
మెడ నుంచి చేప ముళ్ళు
ఆ తర్వాత ఆమె ఆసుపత్రికి వెళ్లింది. కానీ, ఆశ్చర్యంగా ఎక్స్-రే తీసినా ఆ ముల్లు కనిపించలేదు. దీంతో అది సహజంగానే బయటకు వెళ్లిపోయిందని భావించి వారు ఇంటికి తిరిగి వచ్చారు. అయితే రెండు వారాల తర్వాత.. సంగ్ కి మెడ నొప్పి, వాపు బాగా ఎక్కువయ్యాయి. దీంతో అదేమైనా థైరాయిడ్ సమస్య కావచ్చని భయపడి మళ్లీ ఆసుపత్రికి వెళ్లారు. కానీ అప్పుడు కూడా డాక్టర్లు ఏమీ కనుగొనలేకపోయారు. అంతా నార్మల్ వచ్చింది.
తీరా ఒక రోజు నొప్పికి క్రీమ్ రాసుకుంటుండగా ఆమెకు మెడలో ఏదో గుచ్చుకుంటున్నట్లు అనిపించింది. పరిశీలించి చూడగా.. మెడ పక్క నుంచి దాదాపు 2 సెం.మీ పొడవైన చేప ముల్లు బయటకు పొడుచుకొని వచ్చింది! వెంటనే ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లు దీన్ని చూసి ఆశ్చర్యపోయారు.
మింగిన చేప ముల్లు చర్మాన్ని చీల్చుకుని బయటకొచ్చిన మొదటి కేసు ఇదేనని వారు అన్నారు. ఆమెకు చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఆ ముల్లును సురక్షితంగా తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సంగ్ భర్త సూర్యన్ ఫేస్ బుక్ లో పంచుకున్నాడు. ఈ సంఘటన చేపలు తినేవారికి ఒక హెచ్చరికల అతడు తెలిపాడు.
Also Read: Kannappa Piracy: మంచు విష్ణు 'కన్నప్ప' కు పైరసీ దెబ్బ.. వేల సంఖ్యల్లో ఆన్ లైన్ లింకులు