TGSRTC: ఆర్టీసీలో తగ్గుతున్న ఉద్యోగులు.. డ్రైవర్లే కండక్టర్లుగా !

గతంలో ఏసీ, సూపర్‌ లగ్జరీ లాంటి నాన్‌స్టాప్‌ బస్సుల్లోనే ఈ విధానం ఉండేది. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌లలో కూడా డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే బాధ్యతలు అప్పగిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. కండక్టర్ల కొరత ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి.

New Update
TGSRTC Express Bus

TGSRTC Express Bus

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం కండక్టర్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో డ్రైవర్లే కండక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఏసీ, సూపర్‌ లగ్జరీ లాంటి నాన్‌స్టాప్‌ బస్సుల్లోనే ఈ విధానం ఉండేది. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌లలో కూడా డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే బాధ్యతలు అప్పగిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. దీనివల్ల చాలాచోట్ల బస్సులు ఆలస్యంగా తమ గమ్యస్థానాలకు చేరుతున్నాయి. బస్సుల్లో ప్రయాణికులకు కూడా ఇది ఇబ్బందికరంగా మారుతోంది. 

Also Read: BJP అధ్యక్ష పదవి.. రామ్‌చందర్ రావు , ఈటలలో ఒకరికే అవకాశం

ముఖ్యంగా గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తారు. మహిళలకు ఫ్రీ బస్‌ స్కీమ్ అందుబాటులో ఉండటంతో ఇవి మరింత కిక్కిరిసిపోనున్నాయి. సూర్యపేట-దిల్‌సుఖ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో కండక్టర్‌ను జూన్ 25 నుంచి అధికారులు తప్పించారు. దీంతో తుంగతుర్తి, వెలుగుపల్లి, అర్వపల్లి, వంగమర్తి, కొండారం లాంటి గ్రామాల్లో... నకిరేకల్, కట్టంగూరు, చౌటుప్పల్ లాంటి మండల కేంద్రంలో ఆగుతూ వెళ్తుంది. డ్రైవర్లు బస్సు నడుపుతూ దాదాపు 400 మంది ప్రయాణికులకు టికెట్లు ఇవ్వాల్సి వస్తోంది. వరంగల్‌లో కూడా 30 కి పైగా బస్సుల్లో డ్రైవర్లే కండక్టర్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాంలో ఇలాంటి సర్వీసులు ఇంకా చాలా ఉన్నాయి. 

Also Read: ఝార్ఖండ్‌లో భారీ వరదలు.. చిక్కుకున్న 162 మంది విద్యార్థులు

800లకు పైగా కండక్టర్ల కొరత

ఇదిలాఉండగా ఆర్టీసీలో 800లకు పైగా కండక్టర్ల కొరత ఉంది. త్వరలో భర్తీ చేయనున్న 3 వేల ఉద్యోగాల్లో కూడా అసలు కండక్టర్ పోస్టులే లేవు. ఈ క్రమంలోనే దూర ప్రాంత సర్వీసులను డ్రైవర్లతోనే నడిపిస్తోంది ఆర్టీసీ. ఇందుకోసం డ్రైవర్‌కు ఒక్కో టికెట్‌కు రూపాయి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. కానీ వాళ్లకు పనిభారం పెరుగుతోంది. 

Also Read: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్!

Also Read: ఆంధ్ర తీరంతో జెల్లీ ఫిష్‌ల కలకలం.. భయాందోళనలో పర్యాటకులు


Advertisment
తాజా కథనాలు