Kannappa Piracy: ఎంతో బాధగా ఉంది.. ‘కన్నప్ప’ పైరసీపై మంచు విష్ణు ఎమోషనల్

‘కన్నప్ప’ పైరసీపై మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘మా సినిమా పైరసీ బారిన పడింది. ఇప్పటికే 30వేలకు పైగా అక్రమ లింక్‌లు తొలగించాం. ఇది ఎంతో బాధాకరమైన విషయం. పైరసీ అనేది నిజానికి ఒక దొంగతనం. పైరసీ కంటెంట్‌ని ప్రోత్సహించవద్దు’’ అని రాసుకొచ్చాడు.

New Update
Kannappa Piracy manchu vishnu

Kannappa Piracy manchu vishnu

‘కన్నప్ప’ మూవీకి భారీ దెబ్బ తగిలింది. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు, మూడు రోజులకే ఫుల్ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. ఈ పైరసీతో కన్నప్ప మూవీ టీంకి ఊహించని దెబ్బ పడిందనే చెప్పాలి. వేలాది లింకులు ఆన్‌లైన్‌లో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో మేకర్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

Also Read :  షఫాలీ కేసులో బిగ్ ట్విస్ట్.. బెడ్ రూమ్‌లో ఆ టాబ్లెట్‌ గుర్తించిన పోలీసులు!

మంచు విష్ణు ఎమోషనల్

ఇదే విషయంపై మంచు విష్ణు స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘ప్రియమైన సినిమా ప్రియులారా.. మా  ‘కన్నప్ప’ సినిమా పైరసీ బారిన పడింది. ఇప్పటికే 30వేలకు పైగా అక్రమ లింక్‌లు తొలగించబడ్డాయి. ఇది ఎంతో బాధాకరమైన విషయం. 

Also Read :  రాత్రి పడుకునే ముందు పాలు తాగుతున్నారా..? దాని దుష్ప్రభావాలు ఇవే

పైరసీ అనేది నిజానికి దొంగతనం. మనం మన  పిల్లలకు దొంగతనం చేయమని  నేర్పించము కదా?  పైరేటెడ్ కంటెంట్ చూడటం కూడా అలాంటి పనే. దయచేసి పైరసీ కంటెంట్‌ని ప్రోత్సహించవద్దు. సినిమాను సరైన మార్గంలో సపోర్ట్ చేయండి. హర్ హర్ మహాదేవ్’’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

Also Read :  కర్ణాటక సీఎం మార్పుపై సంచలన అప్‌డేట్‌

Also Read :  బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

Manchu Vishnu | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | 2025 Tollywood movies

#2025 Tollywood movies #telugu-film-news #telugu-cinema-news #today-news-in-telugu #telugu-news #latest-telugu-news #kannappa #Manchu Vishnu
Advertisment
తాజా కథనాలు