/rtv/media/media_files/2025/06/30/kerala-childrens-killed-2025-06-30-17-24-46.jpg)
KERALA CHILDRENS KILLED
KERALA CHILDRENS KILLED : కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఓ యువతి పెళ్లి కాకుండానే తల్లయింది. ఆ పుట్టిన పిల్లల్ని పురిట్లోనే చంపేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో పోలీసులు ఆమెతో పాటు ప్రియున్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం భవిన్, అనీషాలకు 2020లో పేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. మొదట స్నేహితులుగా ఉన్న వీరు ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. పెళ్లి చేసుకోకుండానే సహజీవనం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అనీషా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదట 2021లో మొదటి బడ్డకు జన్మనివ్వగా పురిట్లోనే చంపేసింది.బొడ్డు తాడు చుట్టుకొని చనిపోయాడంటూ నమ్మించింది. ఆ తర్వాత రెండోసారి 2024లో మరో బిడ్డ పుట్టగా ఆ బిడ్డను అనీషా గొంతుకోసి చంపింది.
Also Read: చెత్త లారీలో నగ్నంగా మహిళ మృతదేహం.. సినిమా లెవెల్‌లో దారుణ హత్య!
కాగా మృతి చెందిన పిల్లల మృతదేహాలను రెండుసార్లు ఇంటివెనుకే పాతిపెట్టారు. ఇదిలా ఉండగా భవిన్ ను కాదని అనీషా మరోవ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది. అనంతరం ఇంటివెనుక పాతిపెట్టిన పిల్లల అస్థిపంజరాలను వెలికి తీసి ప్రియుడికి ఇచ్చి ఖర్మకాండ చేయాలని అనీషా కోరింది. తనను కాదని మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమవడంతో కోపంతో రగిలిపోయిన భవిన్ అస్థిపంజారాలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలిసి దిగ్ర్బాంతికి గురైన పోలీసులు అనీషాను అదుపులోకి తీసుకుని విచారించారు. పిల్లల మృతదేహలను పాతిపెట్టిన స్థలాన్ని పరిశీలించారు. ----అస్థిపంజరాల అవశేషాలను డీఎన్ఏ టెస్ట్‌కు పంపిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read: ఉక్రెయిన్‌పై అదిపెద్దదాడి... 477 డ్రోన్లు, 60 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా...