/rtv/media/media_files/2025/06/30/woman-raped-and-killed-2025-06-30-18-01-00.jpg)
Woman raped and killed
TG Crime: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనుత్తల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఒక మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆమెను చంపేందుకు యత్నించడం కలకలం రేపింది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మంకెన జ్యోతి అనే మహిళ జీవనోపాధి కోసం మిర్యాలగూడలో నివసిస్తూ, అప్పుడప్పుడూ సొంత గ్రామమైన జూనుత్తలకు వచ్చేది. అయితే ఆదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ గా పనిచేస్తున్న మహేష్‌తో ఆమెకు చాలాకాలం నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల వారిద్ధరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో జ్యోతిని ఎలాగైనా చంపాలని మహేష్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి దేవరకొండ నుంచి జ్యతిని కారులో తీసుకెళ్లాడు. కారులో వెళ్తున్న సమయంలోనే మార్గమధ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కోపంతో ఊగిపోయిన మహేష్ పథకం ప్రకారం తనతో తీసుకువచ్చిన గడ్డి మందును బలవంతంగా తాగించాడు. దీంతో జ్యోతి అపస్మార స్థితిలోకి వెళ్లింది.అనంతరం జ్యోతిని కారులో తీసుకెళ్తుండగా దారిలో పెట్రోలింగ్ పోలీసులు ఎదురయ్యారు. కారులో మహిళ అఛేతనంగా పడిఉండటంతో అనుమానంతో కారును ఆపి తనిఖీ చేశారు. మహిళ పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే ఆమెను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. కాగా విషయం తెలిసిన భర్త శ్రీనివాస్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నాడు. కాగా జ్యోతిని హత్యచేసి కేసును ఆత్మహత్యగా మలిచేందుకు మహేష్ ప్రయత్నించాడని ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి, బంధువులు ఆరోపించారు.
వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే జ్యోతిని బలవంతంగా అనుభవించడానికి ప్రయత్నించడంతో ఆమె వ్యతిరేకించిందని, అందువల్లే ఆమెకు గడ్డిమందు తాగించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!