DSC: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్!

జులై 1, 2 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు రాయనున్న అభ్యర్థులు హాల్ టికెట్లను apdsc.apcfss.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చుని విద్యాశాఖ తెలిపింది. ఈ నియామక పరీక్షలు జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సి ఉండగా, యోగా దినోత్సవం కారణంగా వాయిదా వేశారు.

New Update
ap pgcet 2025 exams start from tomorrow full schedule

ap DSC

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నుండి డీఎస్సీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు బిగ్ అలర్ట్. జులై 1, 2 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు రాయనున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను apdsc.apcfss.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని విద్యాశాఖ తెలిపింది. మెగా డీఎస్సీ 2025 నియామక పరీక్షలు జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సి ఉండగా, యోగా దినోత్సవం కారణంగా వాయిదా వేశారు. ఈ పరీక్షలను జులై 1, 2 తేదీల్లో నిర్వహించనుండగా, వీటి కోసం కొత్త హాల్ టికెట్లను విడుదల చేశారు. పరీక్ష కేంద్రాలు, తేదీలు అన్ని మారడం వల్ల ప్రతీ ఒక్కరూ కూడా కొత్త హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాలని అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత

ఇదిలా ఉండగా ఈ పరీక్షలకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడంతో ఆయా రాష్ట్రాల్లో కూడా పరీక్షలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్ జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. 

ఇది కూడా చూడండి: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

ప్రాథమిక కీ తేదీ

ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉంటుంది. లాస్ట్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత 2వ రోజు నుంచి ప్రాథమిక కీ రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటి కోసం 7 రోజుల సమయం ఇవ్వనున్నారు. ఇక అభ్యంతరాలు పూర్తైన తేదీ నుంచి మరో 7 రోజుల తర్వాత ఫైనల్ కీ రిలీజ్ చేయనున్నారు. ఇలా ఫైనల్ కీ రిలీజ్ చేసిన 7 రోజుల్లో DSC రిజల్ట్స్ ప్రకటించనున్నారు. 

ఇది కూడా చూడండి: CM Chandrababu Naidu: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. ఆ 15 మంది ఎమ్మెల్యేపై చర్యలు!

 

ఇది కూడా చూడండి: Anchor Swetcha : యాంకర్‌ స్వేచ్ఛ కేసులో బిగ్‌ట్విస్ట్‌...ఆమె మరణానికి పూర్ణనే కారణం..?

Advertisment
Advertisment
తాజా కథనాలు