/rtv/media/media_files/2025/06/30/massive-protest-in-bangladesh-after-hindu-woman-raped-by-local-politician-2025-06-30-13-13-15.jpg)
Massive protest in Bangladesh after Hindu woman raped by local politician
బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. 21 ఏళ్ల హిందూ మహిళపై ఓ లోకల్ రాజకీయ నేత అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రధాన నిందితుడితో పాటు మరో అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సభ్యుడు ఫిరోజ్ అలీ (38) జూన్ 26న ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లి తలుపుకొట్టాడు.
Also Read: అంతరిక్షంలో భారత్ నిఘా.. 52 మిలిటరీ శాటిలైట్‌ల ప్రయోగానికి సిద్ధం
Massive Protest In Bangladesh
ఆమె తలుపులు తీసేందుకు నిరాకరించింది. దీంతో అతడు తలుపులు తోసుకొని వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఫిరోజ్ అలీని పట్టుకొని చితకబాదారు. కానీ వాళ్ల నుంచి అలీ తప్పించుకొని పారిపోయాడు. చివరికీ ఈ ఘటనపై బాధితురాలు జూన్ 27న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఫిరోజ్ అలీని అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!
ఈ ఘటనపై బంగ్లాదేశ్‌వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢాకా వర్సిటీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేశారు. ఇదిలాఉండగా బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికీ భారత్‌లోనే తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే షేక్ హసీనా ప్రభుత్వం కూలినప్పటి నుంచి హిందూ మైనార్టీలపై దాడులు పెరిగాయని నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌పై సంచలన తీర్పు
Also Read : అంతరిక్షంలో భారత్ నిఘా.. 52 మిలిటరీ శాటిలైట్‌ల ప్రయోగానికి సిద్ధం
rape | bangladesh | rtv-news | telugu-news