Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో దంచికొడుతున్న వాన

హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో బీభత్సం సృష్టిస్తోంది. జూబ్లీహిల్స్, వెంకటగిరి, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, గోల్కొండ, మియాపూర్, మెహిదీపట్నం సహా మరిన్ని ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది.

New Update
Hyderabad Rain falling

Hyderabad Rain falling

Hyderabad Rain

హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో బీభత్సం సృష్టిస్తోంది. జూబ్లీహిల్స్, వెంకటగిరి, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, గోల్కొండ, మియాపూర్, మెహిదీపట్నం సహా మరిన్ని ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది. హైదారాబాద్‌తో పాటు అటు ఆదిలాబాద్, నిర్మల్, నారాయణపేట జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది.

ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు పడుతున్నాయి. ఇందులో భాగంగా రీసెంట్‌గా భారత వాతావరణ శాఖ (IMD) ఓ నివేదిక రిలీజ్ చేసింది. జూలై 1వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని.. అల్పపీడనం బలహీనపడుతున్నప్పటికీ.. దాని ప్రభావం పూర్తిగా తగ్గలేదని పేర్కొంది. 

Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు

Telangana Rains

ఇందులో భాగంగానే ఇవాళ పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఇవాళ మాత్రమే కాకుండా రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉంది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు