/rtv/media/media_files/2025/06/30/tirupati-two-men-found-dead-in-car-2025-06-30-10-45-10.jpg)
Tirupati two men found dead in car
AP News: తిరుపతి జిల్లా తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారులో ఇద్దరి యువకుల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. కారులో బీర్లు తాగిన యువకులు మద్యం మత్తులో అలాగే నిద్రించడంతో ఊపిరాడక మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే కారులో నాలుగు బీరు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతులను వినయ్, దిలీప్ గా గుర్తించారు.