/rtv/media/media_files/2024/12/31/28OadyGm8IE6rc3zfveS.jpg)
South Central Railway Introduces New Public Timetable
Railway: ఈ అర్థరాత్రి నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమలుకాబోతున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. అలాగే టికెట్‌బుకింగ్ నిబంధనలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి చేస్తూ రైల్వే జోన్‌ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు సర్క్యులర్ జారీ చేసింది.
1 పైసా నుంచి 15 వరకు..
ఈ మేరకు పెంచిన ఛార్జీలు ఇలా ఉ న్నాయి.500 కి.మీ వరకు సెకండ్ క్లాస్ ఆర్డినరీకి సాధారణ ఛార్జీలే ఉంటాయి. 501 కి.మీ నుంచి 1500 కి.మీ వరకు టికెట్‌పై రూ.5 పెరిగాయి. 201 కి.మీ నుంచి 2500 కి.మీ వరకు టికెట్‌పై రూ.10 పెరిగాయి. 2501 నుంచి 3వేల కి.మీ వరకు టికెట్‌పై రూ.15 చొప్పున పెంచారు. ఆర్డినరీ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ టికెట్లపై కి.మీకు 50పైసలు, మెయిల్/ఎక్స్‌ప్రెస్ (నాన్ ఏసీ) రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీకు 1 పైసా పెంచారు. అన్ని రకాల రైళ్లలో ఏసీ అన్ని తరగతులకు కి.మీకు 2పైసలు పెంచుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్.. బెయిల్‌కు ఆర్థిక సాయం
అలాగే రిజర్వేషన్ ఛార్జ్, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీల్లో మాత్రం మార్పు ఉండదని తెలిపింది. రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు అమలు చేయట్లేదని, సబర్బన్ రైళ్ల ఛార్జీలు, నెలవారీ సీజన్ టిక్కెట్లలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.