Jharkhand Heavy Rains: ఝార్ఖండ్‌లో భారీ వరదలు.. చిక్కుకున్న 162 మంది విద్యార్థులు

ఝార్ఖండ్‌లోని సింగ్బూమ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఆశ్రమ పాఠశాల మునిగింది. దాదాపుగా 162 విద్యార్థులు ఈ పాఠశాల భవనంలో చిక్కుకున్నారు. వెంటనే అధికారులు స్థానికుల సాయంతో వారిని రక్షించారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి.

New Update
Jharkhand Rains

Jharkhand Heavy Rains

ఝార్ఖండ్‌లోని సింగ్బూమ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఓ ఆశ్రమ పాఠశాల మునిగింది. దాదాపుగా 162 విద్యార్థులు ఆశ్రమ పాఠశాల భవనంలో చిక్కుకున్నారు. స్థానికుల సాయంతో అధికారులు వెంటనే వారిని రక్షించారు. వర్షాలకు పొంగి పొర్లుతున్న నదిని విద్యార్థులు భయంగా దాటారు. తీవ్ర వర్షాలకు అక్కడ కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

ఇది కూడా చూడండి:TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత

ఇది కూడా చూడండి:DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

భారీ వరదలకు 24 గంటల పాటు..

అలాగే ఉత్తరాఖండ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర్‌కాశీ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రను మరో 24 గంటలు వాయిదా వేశారు. భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నందున యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులను హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్‌నగర్లలో నిలిపివేయాలని పోలీసులు, పరిపాలన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర వాయిదా పడుతుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి:CM Chandrababu Naidu: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. ఆ 15 మంది ఎమ్మెల్యేపై చర్యలు!

Advertisment
తాజా కథనాలు