Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్ (వీడియో)

టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా ఆడబోతున్నాడు. మొదటి టెస్ట్‌ ఓటమి కారణంగా జట్టు యాజమాన్యం బుమ్రాను ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ డోస్‌చేట్ తెలిపారు.

New Update
bumrah to play 2nd test against england in edgbaston

bumrah to play 2nd test against england in edgbaston

ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్ అందింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆడబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ అందించారు. 

Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!

బుమ్రా ఆడటానికి సిద్ధం

పనిభారం కారణంగా బుమ్రాకు రెండో టెస్ట్‌లో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని అలా భావించారు. కానీ మొదటి టెస్ట్‌ ఓటమి కారణంగా.. జట్టు యాజమాన్యం బుమ్రాను ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడించాలని నిర్ణయించింది. దీంతో ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో భాగం కానున్నాడు. 

Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం

అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బుమ్రా ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ప్లేయింగ్ 11లో భాగం కావాలని భావిస్తే.. దీనిపై చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటాము. మేము ఇంకా పిచ్ గురించి చర్చించుకుంటున్నాం. బుమ్రా నిన్న, నేడు ప్రాక్టిస్ చేశాడు. బుమ్రాను సరిగ్గా ఉపయోగించుకునేలా ప్లాన్ చేసుకోవాలి’’ అని తెలిపాడు. 

ఎడ్జ్‌బాస్టన్‌లో దారుణమైన రికార్డు 

ఎడ్జ్‌బాస్టన్‌లో టీం ఇండియా రికార్డు అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటివరకు ఎడ్జ్‌బాస్టన్‌లో టీం ఇండియా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. 1986లో టీం ఇండియా చివరి టెస్ట్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ గ్రౌండ్‌లో భారత జట్టు ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడింది. అందులో 7 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. మరి ఈసారి ఏం చేస్తుందో చూడాలి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు