/rtv/media/media_files/2025/06/30/hyderabad-2025-06-30-11-23-53.jpg)
హైదరాబాద్‌లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో 10 మంది కార్మికులు స్పాట్‌లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ పేలుడు ధాటికి 100మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడ్డారు. విషయం తెలుసుకుని ఫైర్ ఇంజిన్లు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
#Hyderabad:
— NewsMeter (@NewsMeter_In) June 30, 2025
Reactor blast at #Patancheru Chemical Unit
A reactor blast at Seegachi Chemicals in #Pasamailaram industrial area reportedly killed several workers and injured 20+.
Factory engulfed in flames; rescue ops underway.#Fire engines & ambulances at spot.
Death toll… pic.twitter.com/1uRxcm2YY9
ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత
మరో భవనం కూడా..
ఈ పేలుడు వల్ల రియాక్టర్ భవనం కూలిపోయింది. మరో భవనానికి బీటలు కూడా వచ్చినట్లు సమాచారం. అయితే ఈ పరిశ్రమలో ఇంకొందరు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పేలుడులో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను 11 ఫైరింజన్లతో అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ?