/rtv/media/media_files/2025/06/30/bjp-2025-06-30-06-50-42.jpg)
BJP
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మంగళవారం అధ్యక్షుడి పేరు ప్రకటించనున్నారు. అయితే ఈ పదవి రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకరు ఎంపీ ఈటల రాజేందర్, మరొకరు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు. వీళ్లిద్దరిలోనే ఒకరికి అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. కాబోయే కొత్త అధ్యక్షుడిగా సోమవారం ఉదయం జాతీయ నాయకత్వం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందినట్లు తెలుస్తోంది.
Also Read: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత
అంతేకాదు ఈరోజు నామినేషన్ వేసేది కూడా ఒకరేనని తెలుస్తోంది. దీంతో ఈరోజే బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎవరో తేలనుంది. ఇదిలాఉండగా.. అధ్యక్ష పదవి కోసం ముందుగా నాలుగైదు పేర్లు వినిపించాయి. అయితే ఆదివారం పార్టీ వర్గాల్లో ఇద్దరి పేర్లపై మాత్రమే చర్చ జరిగింది. హైకమాండ్ కొన్ని రోజుల క్రితమే RSS ప్రతినిధులు, రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిసింది. సంఘ్ నేతలు, పార్టీలో మొదటి నుంచి ఉంటున్న సీనియర్ నేతలు కొందరు రామచందర్ రావు పేరు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
Also Read: యాంకర్ స్వేచ్ఛ కేసులో బిగ్‌ట్విస్ట్...ఆమె మరణానికి పూర్ణనే కారణం..?
మరోవైపు ఈటల పేరు కూడా చాలాకాలంగా అధ్యక్ష పదవి కోసం పరిశీలనలో ఉంది. బీసీ వర్గానికి అధ్యక్ష పదవి అప్పగిస్తారనే ప్రచారం కూడా నడిచింది. దీంతో అదిష్ఠానం తనకే బాధ్యతలు అప్పగిస్తుందని ఈటల భావిస్తున్నారు. అయితే వీళ్లిద్దరిలో ఎవరికి పదవి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటించాక పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇక జులై 1న ఎల్బీనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర అధ్యక్షుడి పేరు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
Also Read: యాదాద్రి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య