CM Siddaramaiah: కర్ణాటక సీఎం మార్పుపై సంచలన అప్‌డేట్‌

కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే సోమవారం స్పందించారు. సిద్ధరామయ్యే సీఎంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని స్పష్టం చేశారు.

New Update
CM Siddaramaiah

CM Siddaramaiah

కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. మరో రెండు, మూడు నెలల్లో డీకే శివ కుమార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ ఉందని అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్‌ హుస్సేన్ అన్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే సోమవారం స్పందించారు. సిద్ధరామయ్యే సీఎంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. సీఎం మార్పుపై వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. '' నాయకత్వ మార్పు గురించి పార్టీలో ఎలాంటి ప్రతిపాదన లేదు, చర్చలు జరగలేదు. మేమందరం ఐక్యంగా ఉన్నాం. సమర్థవంతంగా పనిచేస్తున్నామని దేశ్‌పాండే క్లారిటీ ఇచ్చారు. 

Also Read: అంతరిక్షంలో భారత్‌ నిఘా.. 52 మిలిటరీ శాటిలైట్‌ల ప్రయోగానికి సిద్ధం

Big Update On Karnataka CM Siddaramaiah

అయితే ఇటీవల రాజీవ్‌ హౌసింగ్ సొసైటీలో భారీగా అవినీతి జరిగినట్లు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ క్రమంలోనే సీఎం మార్పు అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్‌ హుస్సేన్ మరో రెండు, మూడు నెలల్లో సీఎం మార్పు ఉంటుందని చెప్పడంతో దీనిపై మరింత ఉత్కంఠ పెరగింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని.. ప్రస్తుతం పార్టీ హైకమాండ్ శివకుమార్‌ గురించే మాట్లాడుతోందని ఆయన తెలిపారు.

ఈ ఏడాది చివర్లో కర్ణాటక ప్రభుత్వంలో సీఎం మార్పు గురించి కూడా ఊహగాణాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో డీకే శివకుమార్‌కు సన్నిహితుడైన ఇక్బాల్‌ హుస్సేన్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. కర్ణాటకలో సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక పరిణామాలు ఉంటాయని కర్ణాటక మంత్రి కె. ఎన్ రాజన్న ఇటీవల అన్నారు. అయితే చివరికి ఈ ప్రచారాన్ని మరో  కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే కొట్టిపారేశారు. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మార్పు ఉంటుందని చెప్పడం, మరో సీనియర్ నేత  లేదని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం

ఇదిలాఉండగా కర్ణాటకలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక సీఎం పదవిపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకరించారనే వార్తలు వచ్చాయి. దీంతో శివకుమార్ సీఎం పదవి స్వీకరించే సమయం వచ్చిందనే ప్రచారం జోరుగా నడుస్తోంది.  

Also Read: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

Also Read :  భారత నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది!

 

national-news | karnataka | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు