Jelly Fish in Beach: ఆంధ్ర తీరంతో జెల్లీ ఫిష్‌ల కలకలం.. భయాందోళనలో పర్యాటకులు

ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో జెల్లీ ఫిష్‌లు కలకలం రేపుతున్నాయి. ఈ విష పురుగులు పెద్దఎత్తున తీరంలో ఉంటున్నాయి. ‘అగ్గిబాటా’ అని పిలిచే వీటిని పొరపాటున తాకినా సమస్యలు తప్పవని స్థానికులు అంటున్నారు.

New Update
Jelly fish

Jelly fish

ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో జెల్లీ ఫిష్‌లు కలకలం రేపుతున్నాయి. హైడ్రోజోవా తరగతికి చెందిన ఈ విష పురుగులు పెద్దఎత్తున తీరంలో ఉంటున్నాయి. ‘అగ్గిబాటా’ అని పిలిచే వీటిని పొరపాటున తాకినా, అందంగా ఉన్నాయని పట్టుకున్నా కూడా సమస్యలు తప్పవని స్థానికులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత

ఇది కూడా చూడండి: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

వికారం, తలనొప్పి, వాంతులు..

సముద్ర తీరంలో భారీ గాలులు రావడంతో ఇవి బీచ్ నిండా వ్యాపిస్తున్నాయి. వీటిని తాకితే వికారం, తలనొప్పి, వాంతులు, అలర్జీ, దురద వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. వీటికి ఉప్పు నీరు ఉపశమనం ఇస్తాయి. అప్పటికీ కూడా తగ్గకపోతే మాత్రం వైద్యులను సంప్రదించాలి. తాకడం వల్ల మంట, దురద, దద్దర్లు వంటివి వస్తాయి.. కానీ ప్రాణాంతకం కాదంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: CM Chandrababu Naidu: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. ఆ 15 మంది ఎమ్మెల్యేపై చర్యలు!

ఇది కూడా చూడండి: Anchor Swetcha : యాంకర్‌ స్వేచ్ఛ కేసులో బిగ్‌ట్విస్ట్‌...ఆమె మరణానికి పూర్ణనే కారణం..?

Advertisment
Advertisment
తాజా కథనాలు