/rtv/media/media_files/2025/04/27/RBOdzRYd4lqrk2eYAn5f.jpg)
Heavy rains
Weather Update: ఏపీ(Andhra Pradesh) తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగం వీస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Steady light rains happening in East, North Hyderabad now. Enjoy the cool weather with nice showers. East TG will continue to have NON STOP RAINS next 1-2hrs 🌧️
— Telangana Weatherman (@balaji25_t) June 29, 2025
ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత
ఏపీలో ఈ జిల్లాల్లో..
నేడు ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ?
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మత్స్య కారులు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: CM Chandrababu Naidu: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. ఆ 15 మంది ఎమ్మెల్యేపై చర్యలు!